News
oi-Bogadi Adinarayana
forex reserves: ఈ ఏడాది మొదటి వారంలోనే విదేశీ మారక నిల్వలు 1.268 బిలియన్ డాలర్లు మేర తగ్గిపోయినట్లు ఆర్బీఐ తెలిపింది. జనవరి 7 నాటికి ఫారెన్ రిజర్వ్స్ 561.583 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడించింది. అయితే బంగారం నిల్వలు 461 మిలియన్ డాలర్లు పెరిగి 41.784 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలిపింది.
2021లో ఆల్‌టైం గరిష్ఠం..
అక్టోబర్ 2021లో విదేశీ మారక నిల్వలు దాదాపు 645 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. 2022 ప్రారంభం నాటికి ఈ నిల్వలు 633 బిలియన్ డాలర్లకి తగ్గాయి. ఇటీవల దిగుమతుల ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి క్షీణతను తగ్గించడానికి ఆర్బీఐ జోక్యం కారణంగా విదేశీ మారక నిల్వల్లో చాలా వరకు క్షీణత ఏర్పడినట్లు తెలుస్తోంది.

కరెన్సీ పతనం అడ్డుకోవడానికేనా..?
“రూపాయి క్షీణతను నిరోధించే ఉద్దేశంతో.. ఆర్బీఐ ఎప్పటికప్పుడు డాలర్లు విక్రయిస్తూ, ద్రవ్య నిర్వహణ ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది. విదేశీ మారకద్రవ్య మార్కెట్‌ను కేంద్రబ్యాంకు నిశితంగా పర్యవేక్షిస్తుంటుంది. ముందస్తు లక్ష్యమనేది లేకుండా మారకపు రేటులో అస్థిరతను క్రమబద్ధీకరించేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తెలిపారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి విదేశీ ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తుందా ? అని పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.
English summary
Decline in Indian forex reserves
Forex reserves decline in first week of the year
Story first published: Sunday, January 15, 2023, 6:50 [IST]