ఎండాకాలంలో బయటి నుంచి ఇంటికి రాగానే చాలా మందికి ఫ్రిజ్ నీరు తాగడం అనేది అలవాటు. దీని వల్ల త్వరగా దాహం తీరుతుందని ఇలా చేస్తుంటారు. దీనిన వల్ల లాభమా నష్టమా.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

తగ్గించండి..

ఎండల్లో చల్లని నీరు తాగడానికి చాలా బావుంటుంది. కానీ, అతిగా చల్లగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం చల్లని నీరు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

రోజుకి నీరు ఎంత తాగాలి..

రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో.. తెలుసా?

ఎందుకు వద్దు..

ఎందుకు వద్దు..

ఎండలో నుండి ఇంటికొచ్చాక, వర్కౌట్, భోజనం తర్వాత చల్లని నీరు తాగితే నెగెటీవ్ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
Also Read : రాగి ముద్ద తింటే ఈ నొప్పులు తగ్గుతాయట..

జీర్ణ సమస్యలు..

జీర్ణ సమస్యలు..

ఆయుర్వేదం ప్రకారం.. చల్లని నీరు, డ్రింక్స్ జీర్ణక్రియని బలహీనపరుస్తాయి. ఇది జీర్ణ సమస్యల్ని తీసుకొస్తాయి. వీటితోపాటు రక్తనాళాలను ఇరుగ్గా మారుస్తుంది. ఇది జీర్ణ సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి, ఈ నీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

గొంతులో మంట..

గొంతులో మంట..

ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగితే జలుబు ఉంటుంది. దీంతోపాటు కొంతమందికి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. వీటితోపాటు గొంతునొప్పి, జలుబు, గొంతు వాపు వంటి సమస్యలు కూడా ఉంటాయి.

గుండె సమస్యలు ఉన్నవారికి..

గుండె సమస్యలు ఉన్నవారికి..

చల్లని నీరు ఎక్కువగా గితే.. గుండె వేగం తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు చల్లని నీరు తాగొద్దొని చెబుతున్నారు నిపుణులు.
Also Read : Soaked Raisins : ఎండుద్రాక్షని ఇలా తింటే రక్తం పెరుగుతుందట..

తలనొప్పి..

తలనొప్పి..

ఎండనుంచి బయటికి వచ్చిన వెంటనే చల్లని నీరు తాగితే వెన్నెముకలోని నరాలు చల్లగా అవుతాయి. ఇది మెదడుని ప్రభావితం చేసి తలనొప్పికి కారణామవుతుంది.

బరువు పెరగడం..

బరువు పెరగడం..

బరువు తగ్గాలనుకునేవారు చల్లని నీటికి దూరంగా ఉండాలి. నీరు శరీరంలోని కొవ్వుని కరిగించడం కష్టమవుతుంది. దీని వల్ల కొవ్వు బలంగా మారి బరువు తగ్గరు.

ఏ నీరు తాగాలి..

ఏ నీరు తాగాలి..

నిపుణుల ప్రకారం సహజ ఉష్ణోగ్రత, రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నీరు తాగడం మంచిది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలు దూరమవ్వాలంటే భోజనం చేశాక గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​Read More : Health News and Telugu News



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *