Tuesday, April 13, 2021
Array

Funny Video:కెమెరామెన్‌ను చితకబాదిన పెళ్లి కొడుకు..హాయిగా నవ్వుకోండి..!


National

oi-Kannaiah

|

సోషల్ మీడియా విస్తరించిన తర్వాత వార్తలకు కొదవలేదు. ఆ వార్తలు వాస్తవికమైనవైనా సరే తప్పుడు ప్రచారాలైనా సరే.. ఒక్క పోస్టు చేస్తే చాలు కొన్ని మిలియన్ల మందికి చేరుతోంది. అలానే సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు కూడా పోస్టు అవుతుంటాయి. కొన్ని చూసేందుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటే… మరికొన్ని వీడియోలు చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటాయి. కొన్ని ఫన్నీ వీడియోస్ చూస్తే నవ్వు ఆపుకోలేం. అలా అనీ ఆ వీడియోను షేర్ కూడా చేయకుండా ఉండలేము. అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి మీకోసం. అయితే ఈ వీడియో ఎవరో కావాలనే ముందస్తు ప్లాన్ ప్రకారం చేశారా లేక సహజంగానే ఈ ఘటన జరిగిందా అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. ఏదైతే ఏముంది నవ్వుకోవడానికి ఇదొక మంచి వీడియో అవుతుంది.

ఇక అసలు విషయానికొస్తే… అదో పెళ్లి వేడుకలా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె వేదికపై నిల్చుని ఉన్నారు. పెళ్లంటే ఆ హడావుడి మామూలుగా ఉండదనేది అందరికీ తెలిసిందే. ఫోటోలు, వీడియోలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మరుపురానివే. అయితే ఈ వీడియోలో మాత్రం పెళ్లికొడుకు పెళ్లి కూతురుకు ఓ వ్యక్తి ఫోటోలు తీస్తున్నాడు. ఇందులో నవ్వుకోవాల్సిన విషయం లేదు. కానీ ఆ తర్వాత జరిగింది చూస్తూనే నవ్వు ఆపుకోలేరు. పెళ్లికొడుకును పక్కనబెట్టిన ఫోటోగ్రాఫర్ కేవలం పెళ్లికూతురును మాత్రమే ఫోటోలు తీస్తుండటంతో ఆ పక్కను ఉన్న వరుడికి కోపం వచ్చేసినట్లుంది.

ఫోటోల పేరుతో ఆ ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయి ముఖాన్ని తాకడం, స్టిల్స్ పెట్టమని చెబుతుండటంతో పెళ్లికొడుక్కు ఎక్కడా లేని ఆవేశం వచ్చేసింది. ఇంకేముంది ఆ ఫోటోగ్రాఫర్ వీపు విమానం మోత మోయించాడు. దీంతో ఒక్కసారిగా ఆ పెళ్లి కూతరు కిందపడి పడి నవ్వేసింది. ఈ వీడియోను ఓ మహిళ పోస్టు చేసింది. ఈ వీడియోను తొలిసారిగా చూసినప్పుడు చాలా నవ్వేసినట్లు చెప్పుకొచ్చింది.ఇంకా ఆ నవ్వు ఆగలేదని రాసుకొచ్చింది. ఈ వీడియోలో జరిగిన ఘటనకు లాజిక్‌తో పనిలేదని చెప్పిన ఆ మహిళ.. అది కావాలనే షూట్ చేశారా లేక సహజంగా అలా జరిగిపోయిందా అనేది తెలియదంటూ ప్రతి విషయాన్ని లోతుగా పరిశోధించాల్సిన పనిలేదని పోస్టులో రాసింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక నెటిజెన్లు సరదా కామెంట్లు పెట్టుకొచ్చారు.

Source link

MORE Articles

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా మొబిలిటీ కొత్తగా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి అని, లాస్ట్ మైల్ డెలివరీ కోసం పర్యావరణ సాన్నిహిత్యమైన...

पानी में भिगाकर ऐसे करें दालचीनी का इस्तेमाल, होंगे ये 6 फायदे

अगर दालचीनी के पानी का सही मात्रा सेवन किया जाए, तो महिलाओं खुद को कई गंभीर बीमारियों से बचा सकती हैं.  Source link

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

नवरात्रि के व्रत में अगर खाएंगे ये चीजें तो नहीं होंगे डिहाइड्रेशन के शिकार

नवरात्रि शुरू हो गए हैं. इन दिनों बहुत से लोग नौ दिनों तक व्रत रखते हैं. इन दिनों मां दुर्गा के नौ स्वरूपों...

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ – ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

పసుపు కండువా తలకట్టుతో జూనియర్.. ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe