Gautam Adani: అదానీ దశ తిరిగింది..! కనికరించిన మహరాష్ట్ర సర్కార్.. మెగా ప్రాజెక్ట్

[ad_1]

మెగా ప్రాజెక్ట్..

మెగా ప్రాజెక్ట్..

మహారాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయంతో అదానీకి అండగా నిలుస్తోంది. అతిపెద్ద మురికివాడగా ఉన్న ధారావీని రీడెవలప్ మెంట్ ప్రాజెక్టును అధికారికంగా అదానీ గ్రూప్‌కు అప్పగించడానికి సన్నాహాలు చేస్తోంది ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం. ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌కు అప్పగించడానికి ప్రభుత్వ తీర్మానాన్ని (GR) జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు.

బిడ్ వివరాలు..

బిడ్ వివరాలు..

ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గతంలో అదానీ గ్రూప్ బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన రూ.23,000 కోట్ల ప్రాజెక్ట్ కోసం రూ.5,069 కోట్లకు వేలం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని మురికివాడల ప్రజలు లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ధారవిలోని మురికివాడల్లో నివసిస్తున్న అర్హులైన ప్రజలు ఉచితంగా ఇళ్లను పొందనున్నారు.

మంత్రి వర్గం ఆమోదం..

మంత్రి వర్గం ఆమోదం..

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ రద్దును సవాలు చేస్తూ దుబాయ్‌కి చెందిన సెక్లింక్ గ్రూప్ దాఖలు చేసిన కేసు బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. గత డిసెంబరులో అదానీ గ్రూప్ కు ఈ ప్రాజెక్టును అప్పగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

దీనికి అవసరమైన 47 ఎకరాల రైల్వే భూమిని జాయింట్ మెజర్‌మెంట్ చివరి దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2019లో భూమికి రూ.800 కోట్లు అడ్వాన్స్‌ కూడా చెల్లించింది. మెుత్తం 178 హెక్టార్లలో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *