[ad_1]
అదానీ ఏమన్నారంటే..
Open AI ChatGPT ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. దీనిపై ఆసియాకు చెందిన భారత కుబేరుడు గౌతమ్ అదానీ కూడా పిచ్చి పెంచుకున్నాడు. తాను కూడా చాట్‌బాట్‌కు బానిసగా మారినట్లు అదానీ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు. నవంబరులో వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజాస్వామ్యీకరణకు చాట్‌జిపిటి ప్రారంభించడం ఒక విప్లవాత్మక క్షణమని అదానీ అన్నారు.
ప్రపంచంలో పాపులర్..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఈసారి AI పాపులర్ అయిందని అదానీ తన పోస్ట్‌లో వెల్లడించారు. తాను సైతం దానిని వినియోగిస్తున్నానని.. పైగా దానికి అడిక్ట్ అయినప్పు బిలియనీర్ ఒప్పుకున్నారు. జనరేటివ్ AI భారీ ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదని అదానీ గ్రూప్ చైర్మన్ అన్నారు. మైక్రోసాఫ్ట్ చాట్ జిపిటి ఆధారంగా ప్రోగ్రామర్లు సులువుగా కోడింగ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐ విషయంలో రానున్న కాలంలో కంపెనీ పెను సంచలనాలు సృష్టించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..
AI విషయంలో ముందువరుసలో ఉన్న చైనా అమెరికాను వెనక్కి నెట్టిందని అదానీ అన్నారు. 2021లో చైనీస్ పరిశోధకులు USతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు అదానీ గుర్తిచేశారు. ఇది త్వరలో సంక్లిష్టంగా మారే రేసు మరియు సిలికాన్ చిప్ వార్ లాగా ముగియవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేసే చాట్ GPT.. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. దీన్ని ఓపెన్ ఏఐ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ కంపెనీలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
[ad_2]
Source link