మూడోరోజు కూడా ఊరటనిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్, ఢిల్లీలో తాజా ధరలివే

వరుసగా మూడో రోజు కూడా భారతదేశంలో బంగారం ధరలు స్థిరంగా కనిపిస్తున్నాయి. దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000 రూపాయలుగా కొనసాగుతుంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 గా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లోనూ నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,730 రూపాయలు గాను ఈ సమయానికి ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,150 రూపాయలు గా ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,890 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఇలా

దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000 గా ట్రేడ్ అవుతుంటే, నేడు ఈ సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక చెన్నైలో బంగారం ధరను చూస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,710 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,050 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 56,780గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000గా ప్రస్తుతం ఈ సమయానికి ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

ఇక ఇదే సమయంలో వెండి కూడా గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 300 రూపాయలు తగ్గి కిలో వెండి ధర 71,900 పలుకుతుంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 73,500 రూపాయలకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర గరిష్టంగా 75,800కు చేరగా ప్రస్తుతం తగ్గి 73,500 వద్ద కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే బంగారం, వెండి ధరలు తగ్గుతున్న పరిస్థితులు వినియోగదారులకు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. మరి ఈ తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందా.. లేక ట్రెండు మళ్ళీ మారుతుందా అన్నది మాత్రం అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలు నిర్ణయిస్తాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *