[ad_1]
వాటికి పెరిగిన డిమాండ్..
ఇండియాలో ఇటీవలి కాలంలో తక్కువ బరువుతో రాళ్లు పొదిగి చేసిన ఆభరణాలకు డిమాండ్ భారీగా పెరుగినట్లు తేలింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం నగల ప్రాధాన్యతలు, వినియోగం కూడా వేగంగా మారాయి. దీనికి తోడు బంగారం ఎగుమతులు సైతం రికార్డు స్థాయిలో పెరిగాయి. 2015లో 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ వ్యాపారం 2019 నాటికి 12.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా యూఏఈ, బ్రిటన్, యూఎస్ఏ, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాలకు బంగారు ఎగుమతులు జరుగుతున్నాయి.
ఇండియన్స్ కొనేవి..
దేశంలో ప్రధానంగా వివాహ ఆభరణాల విక్రయం అత్యధికంగా ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో జరుగుతున్న మెుత్తం బంగారు క్రయవిక్రయాల్లో దాదాపుగా 50 శాతానికి పైగా వీటి కోసం వినియోగిస్తున్నారు. పైగా దేశంలో భారీగా వినియోగిస్తున్నది 22 క్యారెట్ల బంగారు ఆభరణాలని తెలుస్తోంది. దీని తర్వాతి స్థానంలో 18 క్యారెట్ల బంగారం నిలిచింది.
డిమాండ్ ఆ రాష్ట్రాల నుంచే..
దేశంలో బంగారానికి ఎక్కువగా డిమాండ్ ఎక్కడి నుంచి ఉందనే విషయాలు మనలో చాలా మందిని తప్పకుండా ఆశ్చర్యపరుస్తాయి. గణాంకాలను పరిశీలిస్తే ఉత్తర భారదేశం కంటే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల నుంచి బంగారం కొనుగోలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దేశంలోని మెుత్తం బంగారం విక్రయాల్లో 40 శాతం వాటాను సౌత్ ఇండియన్ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి ఉండే అభిమానం, డిమాండ్ మనందరికీ తెలసిందే.. తాజా గణాంకాలు కూడా దానినే రుజువు చేస్తున్నాయి.
టన్నుల్లో బంగారం..
2021లో భారతీయులు ఏకంగా 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. చైనా ప్రజలు 673 టన్నుల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి మొదటి స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ బంగారం మార్కెట్‌కు భారత్ బలమైన మూలస్తంభంగా ఉంది.
గ్రామాల్లోని ప్రజలు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం దేశంలోని పెద్ద నగరాల కంటే గ్రామీణ ప్రజలు బంగారాన్ని అత్యధికంగా కొంటున్నట్లు వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి బంగారానికి డిమాండ్ స్థిరంగా కొనసాగటం దిగుమతులు పెరగటానికి ప్రధాన కారణంగా నిలుస్తోందని భారత ప్రాంతీయ అధిపతి BR సోమసుందరం అన్నారు.
[ad_2]
Source link