Gold price today: కొండెక్కి కూర్చుంటున్న బంగారం ధరలు.. పసిడి ప్రియులలో నిరాశ; ధరలిలా!!

[ad_1]

 హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు.. నేడు ఇలా

హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు.. నేడు ఇలా

హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర నిన్నటి తో పోలిస్తే కాస్త పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 51 వేల 100 రూపాయలుగా ఉండగా ఈరోజు ఈ సమయానికి 51 వేల 300 రూపాయలు గా ట్రేడవుతోంది. రూ.200.. 22 క్యారెట్ల బంగారం ధర పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,750 రూపాయలుగా ఉండగా నేడు 55,960 రూపాయలుగా ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు పెరిగినట్టుగా కనిపిస్తుంది. గత పది రోజులుగా చూస్తే జనవరి 1వ తేదీన అంతకుముందు రోజు ఉన్న బంగారం ధర స్థిరంగా ఉన్నట్టు, జనవరి రెండో తేదీన మాత్రమే కాస్త బంగారం ధర తగినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గత పది రోజులుగా బంగారం ధర పెరుగుతున్న పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది.

 ఢిల్లీలో పెరిగిన బంగారం ధరలు... ఎలా ఉన్నాయంటే

ఢిల్లీలో పెరిగిన బంగారం ధరలు… ఎలా ఉన్నాయంటే

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51, 450 రూపాయలుగా ఈ రోజు ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇక నిన్న ధర చూస్తే 51,250 రూపాయలుగా ఉంది. నిన్నటికి ఈరోజుకి రెండు వందల రూపాయల మేర 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఇప్పటివరకు 56 వేల 110 రూపాయలు ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,900 రూపాయలుగా ఉంది. అంటే నిన్నటికి ఈరోజుకి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు పెరిగింది.

 ముంబైలోనూ బంగారం ధరల పెరుగుదల..

ముంబైలోనూ బంగారం ధరల పెరుగుదల..

నేడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 300 రూపాయలు గా ఉంది. నిన్న 51 వేల 100 రూపాయలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉండగా నేడు రెండు వందల రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు ఈ సమయానికి 55, 960 రూపాయలుగా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర 55,750 రూపాయలు కాగా, 210 రూపాయల మేర ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. మొత్తంగా చూస్తే బంగారం ధర మాత్రం దూసుకుపోతుంది. ఏ మాత్రం తగ్గేది లేదంటూ పైపైకి ఎగసిపడుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *