[ad_1]
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలిలా
తాజాగా అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రస్తుతం దేశీయంగానే బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఇక ఈ రోజు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1875 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం కావడం కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశం గా ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 24 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇక దేశీయంగానే బంగారం ధరల పెరుగుదల కనిపిస్తుంది.
హైదరాబాద్ లో బంగారం నేడు ధరలు ఇలా
ఈరోజు దేశీయంగా బంగారం ధరలు విషయానికి వస్తే భారతదేశంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు ఈ సమయానికి 51,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 55,960 రూపాయలు గా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు 51 వేల 300 రూపాయలు గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55 వేల 960 రూపాయలుగా ఉంది.
ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు ఈ సమయానికి 51 వేల 420 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56 వేల 110 రూపాయలు గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 300 రూపాయలు గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,960 గా ఉంది. కొద్దిపాటి క్షీణత మినహాయించి బంగారం ధరలలో పెద్దగా మార్పు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
10 రోజుల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే
జనవరి ఒకటవ తేదీ నుండి ఇప్పటివరకు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరలో తొమ్మిది వందల రూపాయల పెరుగుదల కనిపిస్తుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర గత పది రోజుల్లో 1030 పెరుగుదలను నమోదు చేసింది. మొత్తంగా చూస్తే పెరుగుతున్న బంగారం ధరలు బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. సామాన్యులకు ఊహించని విధంగా ఝలక్ ఇస్తున్నాయి.
[ad_2]
Source link