బంగారం ప్రియులకు షాక్ .. దేశంలో నేడు బంగారం ధరలు ఇలా..

సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితికి బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలు బంగారం ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఇక తాజాగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే..భారతదేశంలో నేడు బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు 52,250 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశంలో 57, 060 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

హైదరాబాద్, ఢిల్లీ లలో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్, ఢిల్లీ లలో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,250 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,060 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 52,400 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 57,210 రూపాయలుగా ఉంది.

ముంబైలో బంగారం ధరలిలా.. అంతర్జాతీయ మార్కెట్ లోనూ పెరిగిన బంగారం ధరలు

ముంబైలో బంగారం ధరలిలా.. అంతర్జాతీయ మార్కెట్ లోనూ పెరిగిన బంగారం ధరలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,250 ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,060 రూపాయలకే ట్రేడ్ అవుతుంది. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం రేట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కంటిమీద కురుకు లేకుండా చేస్తున్నాయి. ఓ పక్క అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధరలు పెరగడం దేశీయంగాను ప్రభావం చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1930 డాలర్ల పైన ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ 24 .14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బంగారం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే బంగారం రేటు 60 వేలకు చేరుతుందని భావిస్తున్నారు.

బంగారం కొనుగోలుదారులకు కొనాలా వద్దా అన్న సంశయం

బంగారం కొనుగోలుదారులకు కొనాలా వద్దా అన్న సంశయం

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా తాజాగా పెరిగిన బంగారం రేట్లతో కొనుగోలు చేయాలి అని భావించేవారు కాస్త సందిగ్ధంలో పడ్డారు. తగ్గుతుందా.. లేక ఇదే ధోరణిలో పెరుగుతూ పోతుందా అన్న సంశయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు బంగారం తగ్గిన దాఖలాలు చాలా తక్కువ. పెరిగిన పరిస్థితులే ఎక్కువ. కాబట్టి బంగారం ధరలు మరింత దూకుడుని చూపించే అవకాశం ఉందన్న భావన తాజా ట్రెండును బట్టి అర్థమవుతుంది. మరి బంగారం కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *