[ad_1]
హైదరాబాద్ మార్కెట్ లో నేడు బంగారం ధరలు ఇలా
ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,370 ట్రేడ్ అవుతుంది. నిన్న ఉన్న బంగారం ధర నేడు కూడా ఇప్పటివరకు స్థిరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత పది రోజుల నుంచి చూసుకుంటే బాగా పెరిగిన బంగారం ధరలు, ప్రస్తుతం రెండు రోజులుగా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల నుండి ఇప్పటివరకు దాదాపు మూడు వేల రూపాయలకు పైగా బంగారం ధర పెరిగింది. ఇక గత పది రోజుల్లో అయితే 1000 రూపాయలకు పైగానే బంగారం ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది
ఢిల్లీలోనూ క్షీణిస్తున్న బంగారం ధరలు.. నేడు ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ తో పోలిస్తే బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,150 గా ఉంది. నిన్న కూడా 52,150 రూపాయలుగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నమోదయింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 56,890 రూపాయల గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లకి 200 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం మీద 210 రూపాయలు తగ్గి, ఢిల్లీలోనూ గత రెండు రోజులుగా బంగారం ధరలు క్షీణిస్తున్నాయి.
ముంబైలోనూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 52000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ముంబై మార్కెట్లో 56,730 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ నిన్నటితో పోలిస్తే కాస్త రేటు తగ్గిన పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేట్ 500 రూపాయలు మేర తగ్గి, 74,800 వద్ద ట్రేడ్ అవుతుంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న బంగారం ధరల పతనం ఇంకా కొనసాగుతుందా? లేక మళ్ళీ ధరలు పుంజుకునే అవకాశం ఉంటుందా? అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్న అంశం.
[ad_2]
Source link