[ad_1]
దేశీయంగా పెరుగుతున్న బంగారం ధరలు
ఇప్పటికే రెండేళ్ల గరిష్టాన్ని దాటి ట్రేడ్ అవుతున్న బంగారం ధరలు, తగ్గుతాయని అందరూ భావిస్తే.. మళ్లీ పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ధరలు కాస్త తగ్గుతున్నప్పటికీ దేశీయంగా మళ్ళీ ధరలు పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం దేశీయ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.
నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు ఎంతంటే
ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,750 గా కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్లో 57,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడలో ఈరోజు 52,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,550 వద్ద మార్కెట్లో కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,900 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,700 ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 52,750 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 57,550 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,800 కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,600 వద్ద ట్రేడ్ అవుతుంది.
చెన్నైలో నేడు బంగారం ధరలు ఎంత ఉన్నాయంటే
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,830 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం చెన్నైలో నేడు 58,720 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదిలా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 71 వేల 300 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుండగా, హైదరాబాదులో కిలో వెండి ధర 74 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు తగ్గుతాయని భావిస్తే, మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్న తీరు ఒకింత షాక్ కు గురిచేస్తుంది.
[ad_2]
Source link
Leave a Reply