నేడు అంతర్జాతీయంగా బంగారం ధరలు ఇలా
అయితే బంగారం ధరలు మళ్ళీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడే కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారు ధరలు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం నేడు అంతర్జాతీయంగా బంగారం ధర చూసినట్లయితే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1856.95 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇక స్పాట్ వెండి ధర ఔన్స్ కు 21.29 డాలర్లుగా కొనసాగుతుంది. ఇక దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే..

నేడు హైదరాబాద్, ఢిల్లీలలో ధరలు ఇలా
హైదరాబాద్లో బంగారం ధర నేడు స్థిరంగా కనిపిస్తుంది. నిన్నటి ధరలే ఈరోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,750 వద్ద కొనసాగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 56,450 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,900గా కొనసాగుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

బంగారం కొనుగోలు దారుల్లో కొనాలా? వద్దా? గందరగోళం
అయితే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ఇటీవల పెరిగిన క్రమంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మళ్లీ మరోమారు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో అదే గనక జరిగితే మళ్లీ బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుంటే బంగారం ధరల దూకుడు కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏది ఏమైనా ఈ ఏడాది అనేక కుదుపులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలు కొనుగోలు చేయాలనుకునే వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి అన్నది మాత్రం వాస్తవం.