బంగారం ధరలు పెరిగే అవకాశం?
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ఎక్కువ శాతం పెరగడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఓ దశలో బంగారం ధర 60వేలకు చేరుతుందని నిపుణులు సైతం అంచనా వేశారు. ఇక ఇటీవల బంగారం ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోలుకు ఇదే మంచి సమయమని, మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్పారు. దీంతో ఇప్పుడు ధరల పెరుగుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ బంగారం కొండెక్కి కూర్చుంటుందా అన్న ఆలోచన అందరిలో కనిపిస్తుంది.

మళ్ళీ స్వల్పంగా పెరుగుతున్న హైదరాబాద్ బంగారం ధరలు
ఇక తాజాగా మూడు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలతో మళ్లీ ధరల దూకుడు కొనసాగుతుందా అన్న ఆందోళన గోల్డ్ లవర్స్ లో వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాదులో 51,750 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో 56,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

ఢిల్లీ, ముంబై, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 51,900గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 56,600గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,750 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,450 రూపాయల వద్ద కొనసాగుతుంది. విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,750 వద్ద కొనసాగుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

మళ్ళీ ధరల పెరుగుదలపై ఆందోళన
మళ్లీ కొద్ది కొద్దిగా పెరుగుతున్న ధరలు.. మళ్లీ బంగారం ధరలు పెరుగుతాయా? అన్న ఆందోళనకు కారణంగా మారింది. ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలపై ప్రభావం కనిపిస్తుంది. అది దేశీయంగానే బంగారం ధరల పైన ప్రభావం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు బంగారం కొనుగోలుపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరల హెచ్చు తగ్గులపై పసిడి ప్రియులకు ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది.