వేల ఉద్యోగులు ఇంటికే..

తాజా తొలగింపులను కంపెనీ ఈ వారం మధ్యలో ప్రారంభిస్తుందని అంతర్గత సమాచారం. వీరిలో ఎక్కువ మంది కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ప్రభావితం అవుతారని తెలుస్తోంది. ఇలా మెుత్తంగా కంపెనీ 3,200 మంది ఉద్యోగులను తొలగించనుంది.

కంపెనీ ఏమంటోంది..

కంపెనీ ఏమంటోంది..

అయితే కంపెనీ తొలగింపుల గురించి ప్రతినిధికి ప్రశ్నించగా ఆయన దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. కంపెనీ సీఈవో డేవిడ్ సోలమన్ ఆధ్వర్యంలో.. 2018 చివరి నుంచి ఉద్యోగుల సంఖ్య 34% పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 49,000 కంటే ఎక్కువగా ఉంది. ఆస్తుల ధరల క్షీణత కంపెనీ లాభాలపై ప్రభావం చూపుతోంది. రిటైల్ బ్యాంకింగ్ ప్రయత్నాల్లో కంపెనీ చేసిన కొన్ని పొరపాట్లు, ప్రపంచ మార్కెట్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కంపెనీకి భారీగానే నష్టాలను తెచ్చిపెట్టాయి.

తగ్గిన లాభాలు..

తగ్గిన లాభాలు..

కంపెనీ ఆదాయంలో దాదాపుగా 46 శాతం క్షీణత నమోదైంది. 2008లో లెమాన్ బ్రదర్స్ పతనం తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖర్చుల తగ్గింపు కోసం కంపెనీ ఉద్యోగుల తొలగింపులకు ప్లాన్ చేయగా.. మరోపక్క ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు తమ బోనస్ లను సైతం వదులుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో రుణాల వాల్యూమ్ పెరుగటం, ఖర్చులు పెరగటం కొనసాగితే కంపెనీ మరింతగా డబ్బును కేటాయించవలసి ఉంటుంది.

గత ఏడాదికి భిన్నంగా..

గత ఏడాదికి భిన్నంగా..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని కంపెనీ భావిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలను మందగించే ద్రవ్య పరిస్థితులను కఠినతరం చేశామని.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా తమ బృందాలను సిద్ధం చేయటంపై దృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించారు. గత సంవత్సరం కంపెనీ తన సీఈవోకు అత్యధికంగా వేతనాన్ని అందించిందని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *