News
oi-Mamidi Ayyappa
PhonePe
News:
డిజిటల్
పేమెంట్స్
వ్యాపారంలో
దిగ్గజ
సంస్థగా
దేశంలో
ఫోన్
పే
ఇప్పటికే
గుర్తింపు
తెచ్చుకుంది.
అయితే
త్వరగా
లాభదాయకమైన
కంపెనీగా
మారేందుకు
ప్రయత్నిస్తున్న
కంపెనీ
వేగంగా
ఇతర
వ్యాపార
ఆలోచనలను
రంగంలోకి
దించుతోంది.
ఈ
క్రమంలో
ఫిన్‌టెక్
దిగ్గజం
PhonePe
దేశంలోని
ఆండ్రాయిడ్
వినియోగదారుల
కోసం
ప్రత్యేక
అప్లికేషన్
స్టోర్‌ను
ప్రారంభించే
ప్రక్రియలో
ఉంది.
ఆసియాలో
రెండవ
అతిపెద్ద
ఆర్థిక
వ్యవస్థ
అయిన
భారదేశంలో
మొబైల్
చెల్లింపుల
పరిశ్రమను
శాసిస్తున్న
వాల్‌మార్ట్
మద్దతుగల
సంస్థ
ఫోన్
పే
నుంచి
వస్తున్న
కొత్త
ఉత్పత్తి
ఇది
కావటం
గమనార్హం.

ప్రస్తుతం
యాప్
స్టోర్
వ్యాపారంలో
గూగుల్
కింగ్‌గా
కొనసాగుతోంది.
అయితే
స్థానిక
డెవలపర్లకు
సహాయం
చేస్తూ..
వినియోగదారులు
మెచ్చే
అధిక
నాణ్యమైన
సేవలను
అందించటం
లక్ష్యంగా
అనేక
భాషల్లో
పరిష్కారాలు
అందించే
విధంగా
దీనిని
తీసుకొస్తున్నట్లు
వార్తలు
వస్తున్నాయి.
అయితే
దీనిపై
కంపెనీ
ఇప్పటి
వరకు
ఎలాంటి
ప్రకటన
చేయలేదు.
అయితే
ఇటీవల
కంపెనీ
బెంగళూరు
కేంద్రంగా
పనిచేస్తున్న
స్టార్టప్
IndusOSను
కొనుగోలు
చేసిన
తర్వాత
యాప్
స్టోర్‌ల
మార్కెట్‌లోకి
ఫోన్
పే
ప్రవేశించాలని
చూస్తున్నట్లు
వార్తలు
వచ్చాయి.
స్మార్ట్‌ఫోన్
తయారీ
సంస్థలతో
భాగస్వామ్యాలను
సృష్టించుకుని
కస్టమర్లకు
చేరువకాలాలని
చూస్తోంది.
PhonePe
కూడా
భారతదేశంలో
యాప్
స్టోర్‌ను
ప్రారంభించే
ప్రక్రియలో
ఉన్నట్లు
ధృవీకరించింది.
ప్రస్తుతం
యాప్
స్టోర్
మార్కెట్‌లో
97
శాతం
భారతీయ
వినియోగదారులను
Google
ఆదేశిస్తున్నట్లు
ఫోన్
పే
అధికారిక
ప్రతినిధి
టెక్
క్రంచ్‌కి
తెలిపారు.
ప్రస్తుతం
తమకు
450
మిలియన్ల
యూజర్లు
ఉన్నారని
తెలిపారు.
English summary
Digital payment fintech Giant PhonePe to launch app store in india challenging Google play store
Digital payment fintech jaint PhonePe to launch app store in india challenging Google play store
Story first published: Monday, April 24, 2023, 15:10 [IST]