కోతలు పెంచాలంటూ..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గూగుల్ వేల మంది ‘ఓవర్‌పెయిడ్’ ఉద్యోగులను తొలగించాలని హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోహ్న్ సుందర్ పిచాయ్‌కి సలహా ఇచ్చారు. గత వారం కంపెనీ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాట్లు ప్రకటించింది. కంపెనీలో అవసరాని కంటే ఎక్కువ మందిని కంపెనీ కలిగి ఉందని మెుత్తం వర్క్ ఫోర్స్ లో 20 శాతం మందిని తగ్గించాలని క్రిస్టోఫర్ హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులపై కంపెనీ నిర్ణయం సరైన దిశలో వేసిన ఒక అడుగని తన ట్వీట్ లో రాశారు.

2021 చివరికి..

లెక్కల ప్రకారం 2021 చివరినాటికి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ దాదాపుగా 1,50,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ దీనికంటే 20 శాతం మంది ఉద్యోగులను అధికంగా కలిగి ఉందని తెలుస్తోంది. ఆర్థిక అస్థిరతల నుంచి కంపెనీని రక్షించేందుకు ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవాలంటూ నవంబర్ 2022లో ఇన్వెస్టర్ Hohn ఒక లేఖ రాశారు.

అధిక జీతాలు..

అధిక జీతాలు..

గూగుల్ అత్యధిక జీతాలను అందుకుంటున్న సగటు ఉద్యోగికి దాదాపుగా 3 లక్షల డాలర్లను అందిస్తోంది. ఇది కంపెనీపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని Hohn తెలుపారు. అమెరికా టెక్ దిగ్గజాలు గత సంవత్సరంలో మెుత్తంగా 70,000 మంది ఉద్యోగులను తొలగించాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 2023లో కంపెనీలు రోజుకు సగటున 1,600 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇన్వెస్టర్లు సైతం కంపెనీ ఖరీదైన ఖర్చులను తగ్గించుకోవటానికి ఉద్యోగులను తొలగించాలని కోరుతున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *