[ad_1]
సూపర్ పాపులారిటీ..
చాట్ జీపీటీ విడుదలైన అనతి కాలంలోనే కోట్ల మంది నుంచి ఆదరణ పొందినట్లు ఇటీవల వెల్లడైంది. వ్యాపారపరంగా ఇది గూగుల్ కు పెద్ద సవాలనే చెప్పుకోవాలి. దీంతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫిబ్రవరి 6న బార్డ్ అనే ప్రయోగాత్మక సంభాషణ AI సేవను ఆవిష్కరించింది. భారత దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తాను సైతం చాట్ జీపీటీ వినియోగానికి బానిసనయ్యానంటూ ఇటీవల కామెంట్ చేయటంతో ఇండియాలోనూ దానికి పెరుగుతున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది.
సుందర్ పిచాయ్..
రానున్న మరికొన్ని వారాల్లో ప్రజలకు మరింత విస్తృతంగా Bard ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు. అయితే దీనికి ముందు మెుదట దీనిని “trusted testers” వినియోగిస్తారని తెలిపారు. అందువల్ల దీనిని మరింతగా మెరుగుపరిచేందుకు వీలుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికి ముందు గతవారం కంపెనీ ఆదాయాలకు సంబంధించిన మీటింగ్ సమయంలో ఈ సేవను ప్రారంభించటాన్ని ఆటపట్టించారు(టీజ్ చేశారు).
అట్లాస్ పేరుతో..
గూగుల్ తన బార్డ్ ప్రాజెక్టును అట్లాస్ పేరుతో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. బార్డ్ కూడా చాట్ జీపీటీ మాదిరిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. దీనిని లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ ఆధారంగా రూపొందించారు. ఇది ఎవరైనా యూజర్ ఒక ప్రశ్న వేయగానే దానికి సంబంధించి ఇంటర్నెట్ లో ఉన్న అత్యుత్తమ తాజా సమాచారాన్ని సేకరించి అందిస్తుంది.
రెండింటికీ తేడా..
మైక్రోసాఫ్ట్ మద్దతుతో మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ, గూగుల్ రూపొందిస్తున్న బార్డ్ రెండూ దాదాపుగా ఒకే రకమైన సేవలను అందిస్తాయి. అయితే బార్డ్ ఆన్ లైన్ లో ఉన్న తాజా సమాచారం ఆధారంగా వినియోగదారులకు ఏఐ ఆధారిత సేవలను అందిస్తోంది. ఇకే సమయంలో చాట్ జీపీటీ మాత్రం 2021 వరకు ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా వినియోగదారుల ప్రశ్నలకు సమాచారం ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాట్ జీపీటీ ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ.. దీని పెయిడ్ వెర్షన్ చాట్‌జీపీటీ ప్లస్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది యూజర్ల మనసును దోచుకుంటుంతో రానున్న కాలంలో తెలుస్తుంది.
[ad_2]
Source link
Leave a Reply