GT vs SRH : అంపైర్‌తో గొడ‌వ పై స్పందించిన గిల్‌.. అందుకే అలా చేశా..

Date:

Share post:


అంపైర్‌తో గొడ‌వ‌పై గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు.

GT vs SRH : అంపైర్‌తో గొడ‌వ పై స్పందించిన గిల్‌.. అందుకే అలా చేశా..

Courtesy BCCI

Updated On : May 3, 2025 / 9:59 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ రేసులో మ‌రో అడుగును ముందుకు వేసింది గుజ‌రాత్ టైటాన్స్‌. శుక్ర‌వారం న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 38 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 22 డాట్ బాల్స్ మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఓ ఇన్నింగ్స్‌లో న‌మోదైన అత్య‌ల్ప డాట్ బాల్స్ ఇవే కావ‌డం గ‌మ‌నార్హం.

దీనిపైనే కాకుండా థ‌ర్డ్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్ట‌డం, ఫోర్త్ అంపైర్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం వంటి విష‌యాల‌పైనా మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు. మ్యాచ్‌లో తాను 110 శాతం ఎఫ‌ర్ట్ పెట్టి ఆడిన‌ట్లుగా చెప్పాడు.

SRH playoffs scenario : గుజ‌రాత్ చేతిలో ఓడినా కూడా ప్లేఆఫ్స్ చేరుకునేందుకు స‌న్‌రైజ‌ర్స్‌కు ఛాన్సుంది? ఎలాగంటే?

ముందుగా 20 ఓవ‌ర్ల‌లో 22 డాట్ బంతుల‌ను మాత్ర‌మే న‌మోదు చేయ‌డం గురించి గిల్ మాట్లాడుతూ.. వాస్త‌వానికి తాము దీన్ని ప్లాన్ చేయ‌లేద‌న్నాడు. నిజం చెప్పాలంటే ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఆడుతున్నామో అలాగే ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లోనూ ఆడాల‌ని అనుకున్నామ‌ని అన్నాడు. ఈ న‌ల్ల‌మ‌ట్టి పిచ్ పై సిక్స‌ర్లు కొట్ట‌డం అంత తేలికేం కాద‌న్నాడు. అయిన‌ప్ప‌టికి తాను, సాయి సుద‌ర్శ‌న్‌, జోస్ బ‌ట్ల‌ర్ ఆడిన విధానం బాగుంద‌న్నాడు.

‘స్కోరు బోర్డును ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌నే దానిపై మాకు ఓ అవ‌గాహ‌న ఉంది. ఇన్నింగ్స్ చివ‌రి వ‌ర‌కు మాలో ఒక‌రు ఉండాల‌ని మేము ఎప్పుడు అనుకోలేదు. మేం ప‌రుగుల ఆక‌లితో ఉన్నాము. జ‌ట్టుకు ఏది మంచిదో అది మాత్ర‌మే చేస్తాము.’ అని గిల్ అన్నాడు.

ఇక ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యాలు సాధిస్తున్న‌ప్ప‌టికి ఫీల్డింగ్ లో ప‌లు త‌ప్పిదాల‌ను చేస్తోంది. దీనిపైనా గిల్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌కు ముందు ఫీల్డింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్ప‌టి వ‌ర‌కు బెస్ట్ అయితే ఇవ్వ‌లేదు కానీ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో మాత్రం మెరుగ్గానే ఫీల్డింగ్ చేశాం. ఇలాంటి మైదానాల్లో లక్ష్యాన్ని కాపాడుకోవ‌డానికి ఆపన్లు ఉండ‌డం ఎప్పుడూ మంచిదే. ‘అని తెలిపాడు.

GT vs SRH : గుజ‌రాత్ చేతిలో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కామెంట్స్ వైర‌ల్‌.. మేం ఎందుకు ఓడిపోయామంటే..

ఇక అంపైర్ల నిర్ణ‌యాల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో అంపైర్ల‌తో నాకు కొంచెం చ‌ర్చ జ‌రిగింది. కొన్ని సంద‌ర్భాల్లో మ‌నం 110 శాతం ఇచ్చిన‌ప్పుడు భావోద్వేగాలు ఇలాగే ఉంటాయి. ఇలాంటివి జ‌ర‌గ‌డం స‌హ‌జం అని గిల్ అన్నాడు.





Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...