Guavas for diabetes: డయాబెటిస్.. ఇది సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఒకసారి షుగర్ వస్తే.. దీన్ని పూర్తిగా నయం చేయలేం. దీర్ఘకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. కిడ్నీ, నరాలు, కంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. షుగర్ ఫేషెంట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకుంటే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మెడిసిన్స్ వాడుతూ, పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి.. అనేక రకాల పండ్లు, కూరగాయలు సహాయపడతాయి, వాటిలో జామ ఒకటి. జామకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్‌కు జామకాయ ఔషధంలా పని చేస్తుంది. షుగర్ పేషెంట్స్ వారి డైట్‌లో జామకాయ చేర్చుకుంటే మేలు జరుగుతుందని డిటాక్స్‌ప్రి వ్యవస్థాపకురాలు, హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ ప్రియాంషి భట్నాగర్ అన్నారు.
Source link
