[ad_1]
భారతీయులకు ప్రయోజనం..
ఈ ఏడాది చివర్లో ప్రారంభించబోయే పైలట్ ప్రాజెక్ట్, పూర్తిగా అమలులోకి వచ్చినప్పుడు అమెరికాలోని వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు పెద్ద ఉపశమనం లభించనుంది. 2004 వరకు కొన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు ప్రధానంగా H-1B వీసాల గడువు పొడిగించుకునేందుకు లేదా అమెరికా వెలుపలే స్టాంప్ చేయించుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే ప్రస్తుతం యూఎస్ లో వీసా రీస్టాంపింగ్ అనుమతించబడం లేదు.
వీసా నిరీక్షణ..
అమెరికా వీసా అంటే రావటం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. పైగా ప్రస్తుతం వీసా పొందటానికి 800 రోజులు లేదా రెండేళ్లు వేచి ఉండాల్సిన సమయంలో విదేశీ కార్మికులకు, వారి కంపెనీలకు చాలా పెద్ద అసౌకర్యం. ఇండియా, చైనా వంటి దేశాల నుంచి వేల మందిని టెక్ కంపెనీలు నియమించుకునేందుకు H-1B వీసాలపైనే అత్యధికంగా ఆధారపడుతుంటాయి.
విదేశాంగ శాఖ..
నిర్దిష్ట పిటిషన్-ఆధారిత NIV కేటగిరీల కోసం ఈ సేవను పునఃప్రారంభించే ప్రణాళికలపై కృషి చేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ప్రారంభంలో వీటిని పొందేందుకు ఎంత మంది అర్హులవుతారనే విషయం తాము చెప్పలేమని సదరు అధికారి తెలిపారు. గత కొన్ని నెలలుగా బైడెన్ ప్రభుత్వం వీసా ప్రాసెసింగ్ వ్యవస్థను క్రమబద్దీకరించటానికి, అసౌకర్యాలను తగ్గించటానికి అనేక చర్యలు తీసుకుంది.
[ad_2]
Source link
Leave a Reply