News
oi-Chekkilla Srinivas
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC)కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-20లో కొంత మంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైందని ఆర్‌బీఐ ఆ ప్రకటనలో తెలిపింది.
దీనికి పెనాల్టీ ఎందుకు విధించకూడదని కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి కంపెనీ వివరణ ఇచ్చింది. కంపెనీ సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా లేదని జరిమానా విధించారు. 2019-20 మధ్యకాలంలో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నామినేట్ చేసిన బ్యాంకు ఖాతాలకు కంపెనీ బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైనట్లు ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కింగ్ రంగ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ పే (ఇండియా) లిమిటెడ్‌పై 3 కోట్లకు పైగా జరిమానా విధించింది. పెనాల్టీ విధిస్తున్నప్పుడు, కంపెనీ KYC (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించడం లేదని RBI పేర్కొంది.
English summary
RBI imposed Rs 5 lakh fine on hdfc
The Reserve Bank of India (RBI) has given Housing Development Finance Corporation Limited (HDFC) a shock. A fine of five lakh rupees has been imposed for violation of the rules.
Story first published: Saturday, March 18, 2023, 16:15 [IST]