News
lekhaka-Bhusarapu Pavani
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. భారతదేశపు అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ HDFC లిమిటెడ్ విలీనానికి నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల యాజమాన్యంలో ఉంటుంది . హెచ్‌డిఎఫ్‌సి ప్రస్తుత వాటాదారులు బ్యాంక్‌లో 41 శాతం వాటాను పొందుతారు.
కంపెనీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తన ఆమోదాన్ని వెల్లడించింది. మార్చి 17న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీనాన్ని ఆమోదించింది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, పీఎఫ్‌ఆర్‌డీఎ, కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి రెగ్యులేటరీ ఆమోదానికి సంబంధించిన లేఖలను పొందింది.

ఇదిలా ఉండగా ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 1.7 శాతం పెరిగి వరుసగా రూ. 2,575.95, రూ.1,578.20 వద్ద ఉన్నాయి. ఈ రెండు సంస్థల విలీనం FY24 రెండవ లేదా మూడవ త్రైమాసికం నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ రెండింటి కలయిక సంస్థ అభివృద్ధిని భారీగా పెంచేందుకు దోహదపడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్ ఛైర్మన్, సీఈవో కెకీ మిస్త్రీ గతంలో వెల్లడించారు.
భారతదేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొనబడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న.. ఆర్థిక సేవల టైటాన్‌ను సృష్టించి. సుమారు 40 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో అతిపెద్ద దేశీయ డీల్ చేసుకోవటానికి చర్చలు సఫలీకృతమయ్యాయి. ప్రతిపాదిత సంస్థ దాదాపు రూ.18 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంటుంది.
English summary
NCLT gave Regulatory Clerance to HDFC, HDFC bank Historic Merger Deal
NCLT gave Regulatory Clerance to HDFC, HDFC bank Historic Merger Deal
Story first published: Friday, March 17, 2023, 20:11 [IST]