చాలా మంది పళ్లు తెల్లగా నిగనిగలాడితే.. నోరు ఆరోగ్యంగా ఉందని ఫీల్‌ అవుతూ ఉంటారు. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు, పళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు పట్టించుకోరు. కేవలం పళ్లు తెల్లగా ఉన్నాయా లేదా అని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అయితే ఈ నోటి సమస్యలు అనేత ప్రాణాంతక వ్యాధులకు సిగ్నల్‌ అని మీకు తెలుసా..? మన ఆరోగ్య సమస్యల గురించి.. నోరు చాలా విషయాలు చెప్తుందని మీకు తెలుసా..?నోటికి సంబంధించిన ఏ రకమైన సమస్యనైనా.. నోటి సమస్య మాత్రమే అని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు. ఇవి సమయానికి గుర్తించి చికిత్స పొందితే.. మొదట్లోనే ఆ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని చెబుతున్నారు.

చిగుళ్ల నుంచి రక్తస్రావం..

మీ చిగుళ్ళు పసుపు రంగులోకి మారినా, బ్రష్ చేసేటప్పుడు రక్తస్రావం అవుతుంటే.. ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల సమస్యలు ఉన్న వారికి గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే అవకాశం రెండుమూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్‌ లోపం కారణంగానూ చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. మల్టీవిటమిన్ సప్లిమెంట్, ఒమేగా-3 ఫిష్ ఆయిల్ తీసుకుంటే.. విటమిన్‌ లోపం నివారించవచ్చు.

నాలుక తెల్లగా అయితే..

మీ నాలుక కాస్త తెల్లగా కనిపించడం నార్మల్‌గా జరిగేదే. అయితే, నాలుకపై తెల్లటి మందపాటి పూత ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి ప్రమాదక వ్యాధికి సంకేతం కావచ్చు. అసాధారణ తెల్లమచ్చలు క్యాన్సర్‌గా మారవచ్చు. వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచి. మౌత్ లైకెన్ ప్లానస్, ఓరల్ థ్రష్ వల్ల కూడా నాలుక తెల్లగా ఉంటుంది. సిఫిలిస్‌‌కు కూడా ఇది సంకేతం కావచ్చు. దీన్ని సీరియస్‌గా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

మౌత్‌ అల్సర్‌..

నోటి పుండ్లు (Mouth ulcer) పెద్ద హాని చేయవు. కొన్ని రోజులు లేదా వారాల్లో నోటి పుండ్లు నయమవుతాయి. హార్మోన్ల మార్పులు, బి విటమిన్ల్‌ లోపం, జింక్, ఐరన్ లోపం కారణంగానూ నోటి పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తగ్గినా, HIV, లూపస్‌ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, నోటి లైకెన్ ప్లానస్, క్రోన్’స్ సమస్యలు ఉన్నా నోటి పుండ్లు వచ్చే అవకాశం ఉంది.

నోటి దుర్వాసన..

నోటి నుంచి చెడు వాసన వస్తే.. మీ ఆరోగ్యంలో ఏదో లోపం ఉన్నట్లే. నోటి దుర్వాస చిగుళ్ల వ్యాధికి సంకేతం. ముక్కు, సైనస్, గొంతులో వాపు ఉన్నా.. నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కొన్ని క్యాన్సర్లు, జీవక్రియ రుగ్మతుల కారణంగానూ.. నోటి నుంచి చెడ్డ వాసన వస్తుంది. కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నా నోటి దుర్వాసన వస్తుంది.

పెదాలు పగిలితే..

కొన్ని సార్లు పెదాల కొనల్లో పగుళ్లు వస్తుంటాయి. ఇది జింక్, విటమిన్‌ బి లోపానికి సంకేతం. ఈ పగుళ్ల జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నా వస్తుంటాయి. అల్సరేటివ్ కొలిటిస్ కారణంగానూ పెదాలు పగులుతాయి. పోషక ఆహారం తీసుకున్నా, విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడినా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *