గుండె సమస్యలకి కారణాలు..
అన్ హెల్దీ లైఫ్ స్టైల్, సరిలేని ఆహారం, వర్కౌట్ చేయకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో గుండె సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారికి గుండె సమస్యలు వస్తే నిజంగా బాధకరమే. ఓ వ్యక్తి చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తే అతని గుండె కూడా ఆరోగ్యంగా ఉందని కాదు.
కరోనరీ స్టెంట్స్..

గుండెలోని రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు గుండె సమస్యలు వస్తాయి. ఈ టైమ్‌లో స్టెంట్స్ పెట్టాలని డాక్టర్స్ సూచిస్తారు. కరోనరీ స్టెంట్స్ గుండె ధమనుల్లో అమర్చిన చిన్న పరికరాలు. ఇవి ధమని తిరిగి మూసుకుపోకుండా కాపాడతాయి.
Also Read : Tulsi : పరగడపున తులసి ఆకులు తింటే ఏమవుతుందంటే..
స్టెంట్స్ రకాలు..

సాధారణంగా స్టెంట్స్ రెండు రకాలుగా ఉంటుంది.
1. మెటల్ స్టెంట్
2. డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్
కరోనరీ స్టెంట్ అంటే మెటల్ స్టెంట్ అనేది ఓ చిన్న మెటల్ మెష్ ట్యూబ్.. ఇది అడ్డంకులని తగ్గించేందుకు కరోనరీ ఆర్టరీలోకి ఉంటుంది..
ఇక డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ అనేది పేరుకు తగ్గట్లుగానే దీర్ఘకాలంలో ధమనిని అడ్డుకోకుండా నిరోధించే ఔషధాన్ని కలిగి ఉన్న చిన్న ట్యూబ్. కొన్నిసార్లు రోగికి స్టెంటింగ్‌తో పాటు కరోనరీ యాంజియోప్లాస్టీ అవసరమవుతుంది.
స్టెంట్స్ తర్వాత..

ఇక స్టెంట్స్ వేశాక ఆ వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో..
స్టెంట్ ప్లేస్‌మెంట్ తర్వాత బరువులు ఎత్తకూడదు
కష్టమైన వర్కౌట్స్ చేయొద్దు.
యాంజియోప్లాస్టీ తర్వాత తేలికపాటి వర్కౌట్స్ చేయొచ్చు.
ఓ పేషెంట్ స్టెంట్స్ తర్వాత ఓ నెల తర్వాత వర్కౌట్‌కి ముందు చేయొచ్చు. అయితే, వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది.
Also Read : మనసు బాలేదా.. వీటిని తినండి క్షణాల్లో రిలాక్స్ అయిపోతారు..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

స్టెంట్స్, కరోనరీ యాంజియోగ్రఫీ వంటి కార్డియాక్ సర్జరీ తర్వాత మానిటరింగ్ ముఖ్యం. గత కొన్ని దశాబ్దాలుగా వైద్యపరమైన ఆవిష్కరణలు, పరిశోధనలు గుండె స్టెంట్స్ వంటి పరికరాల ద్వారా కరోనరీ ఆర్టరీ వ్యాధి భారాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
ఈ ఆపరేషన్ తర్వాత పేషెంట్స్ సాధారణ జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. అయితే, డాక్టర్స్ సలహా ప్రకారం వర్కౌట్స్ చేయాలి. గుండెపోటు తర్వాత జీవితంలో కొన్ని మార్పులు చేయాలి. అయితే, అధునాతన ట్రీట్‌మెంట్‌కి హెల్దీ లైఫ్‌స్టైల్ పాటిస్తే సాధారణ జీవితాన్ని గడొప్పొచ్చు.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Health News and Telugu News