PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Herbal Drinks For Asthma Patients: శీతాకాలం ఈ డ్రింక్స్‌ తాగితే.. ఆస్తమా కంట్రోల్‌లో ఉంటుంది..!


Herbal Drinks For Asthma Patients: దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. వాయుగొట్టాలు ఉబ్బడం వల్ల ఆస్తమా వస్తుంది. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, వంశపారంపర్యమైన కారణాలు, ధూమపానం, మద్యపానం, రసాయనాల వాసన పీల్చడం ఆస్తమాకు కారణం అవుతున్నాయి. ఆస్తమా పేషెంట్స్‌కు శీతాకాలం శత్రువు అనే చెప్పాలి. ఈ సీజన్‌లో చల్లటి వాతావరణం, చలిగాలుల వల్ల ఆస్తమా లక్షణాలు ఉద్ధృతం అవుతాయి. దీంతో ఊపిరి సరిగా అందకా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. శీతాకాలంలో కొన్ని డ్రీంక్స్‌ తాగితే.. ఆస్తమా లక్షణాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

అల్లం, అతిమధురం..

అల్లంలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో మంట, జలుబు, దగ్గు, వైరల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరితిత్తులలో పేరుకున్న శ్లేష్మాన్ని కరిగిస్తుంది. అతి మధురంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వాయుగొట్టాల వాపును తగ్గిస్తాయి.

ఎలా తయారు చేసుకోవాలి..?

  • అతి మధురం – 1 స్పూన్‌
  • అల్లం – 1 ముక్క
  • నీళ్లు – 1 కప్పు

నీటిని బాగా మరిగించి దానిలో తురిమిన అల్లం వేయాలి. అల్లం రసం నీటిలోకి దిగిన తర్వాత అతిమధురం పొడిని దానిలో మిక్స్‌ చేయండి. అది మరిగిన తర్వాత దించి.. గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి. ఈ టీ రోజుకు ఒక్కసారైనా తాగితే ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క, తేనె..

దాల్చినచెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అంటే ఇది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తేనె ఆస్తమా లక్షణాలు నియంత్రించడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి..?

  • దాల్చిన చెక్క పొటి – 1 టేబుల్ స్పూన్
  • తేనె – 1 చెంచా
  • త్రికటుగం – అర చెంచా
  • నీళ్లు – ఒకటిన్నర కప్పులు

రెసిపీ

ఒకటిన్నర కప్పుల నీళ్లలో దాల్చిన చెక్క పొడి, త్రికటుగం వేసి బాగా మరిగించాలి. ఒకటిన్నర కప్పుల నీరు ఒక కప్పుకు అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి, చల్లారిన తర్వత తేనె కలుపుకుని తాగండి. ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవడానికి ఈ టీని రోజుకు రెండుసార్లు తీసుకోండి.

పసుపు, అల్లం..

  • పాలు – ఒక గ్లాస్‌
  • పసుపు – పావు చెంచా,
  • అల్లం – 1 ముక్క

రెసిపీ..

పాలను మరిగించండి. అల్లం పొట్టు తీసి తురుముకోవాలి. ఈ అల్లం ముద్దను గోరువెచ్చని పాలలో మిక్స్‌ చేయండి. ఆ తర్వాత పసుపు వేయండి.

గ్రీన్‌ టీ..

గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీంతో ఆస్తమా లక్షణాలు అదుపులో ఉంటాయి. ఒక కప్పు నీటిని మరిగించి. అందులో గ్రీన్ టీ పొడి వేసి మూత పెట్టి 3-5 నిమిషాలు ఉంచాలి. రోజుకు రెండు సార్లు గ్రీన్‌ టీ తాగితే మంచిది.

సోంపు, పుదీనా..

పుదీనాలోని అధిక మొత్తంలో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. ఆస్తమా లక్షణాలు, శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి.

ఎలా తయారు చేసుకోవాలి..?

  • సోంపు – 1 స్పూన్
  • పుదీనా ఆకులు – 10-15
  • నిమ్మరసం – 1 చెంచా

ఒక కప్పు వేడి నీటిని బాగా మరిగించండి. ఈ నీటిలో సోంపు వేసి బాగా మరిగించాలి. సోంపులోని పోషకాలు పూర్తిగా నీటిలో కలిసిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. నీళ్లలో పుదీనా వేసి మూతపెట్టాలి. పది నిమిషాల తర్వాత వడగట్టి నిమ్మరసం కలిపి గోరువెచ్చగా తాగాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *