Herbal Tea for Thyroid: మన శరీరంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది టి3, టి4 అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ… ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు వచ్చి.. హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్యను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి హెర్బల్ టీ సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్ అన్నారు.