News
lekhaka-Bhusarapu Pavani
Home
Loan:
భారతదేశంలో
ప్రజలకు
సొంతిల్లు
అనేది
ఒక
పెద్ద
కల.
అయితే
దీనిని
నిజం
చేసుకునేందుకు
చాలా
మంది
మధ్యతరగతి
ప్రజలు
గృహ
రుణాలను
తీసుకుంటుంటారు.
అయితే
చాలా
మందికి
ఈఎంఐ
తికమకలు..
రుణాన్ని
భారంగా
మారకుండా
చూసుకోవటం
గురించి
తెలియదు.
హోమ్
లోన్
తీసుకునే
వారు
ఈఎంఐ
భారాన్ని
తగ్గించుకునేందుకు
ఈ
నాలుగు
సూత్రాలు
దోహదపడతాయి.
ముందుగా
హౌసింగ్
లోన్
తీసుకునే
వారు
తమ
డౌన్
పేమెంట్
ఎక్కువగా
ఉండేలా
చూసుకోవటం
వల్ల
ఈఎంఐ
భారం
తగ్గుతుంది.
ఇది
తక్కువ
ప్రిన్సిపల్
మొత్తానికి
దారి
తీసి..
దీర్ఘకాలంలో
భారీగా
డబ్బును
ఆదా
చేసుకునేందుకు
సహాయపడుతుంది.
పైగా
ఇది
బ్యాంకులకు
మీపై
నమ్మకాన్ని
పెంచి
తక్కువ
వడ్డీకి
రుణాన్ని
పొందేందుకు
సహాయపడుతుంది.

హోమ్
లోన్
విషయంలో
రెండవ
సూత్రం
ఏమిటంటే..
రెగ్యులర్
ఈఎంఐ
చెల్లింపులతో
పాటు
ప్రీపేమెంట్స్
చేయటం
ఉత్తమం.
అంటే
మీరు
నెలవారీ
చేయాల్సిన
చెల్లింపులకు
మించి
డబ్బును
హోమ్
లోన్
కింద
చెల్లించటం
వల్ల
మెుత్తం
వడ్డీ
భారంతో
పాటు
రుణ
కాలవ్యవధి
కూడా
తగ్గుతుంది.
ఉదాహరణకు
8
శాతం
రేటుకు
20
ఏళ్లకు
రూ.50
లక్షలు
రుణం
తీసుకుంటే
రూ.43
వేలు
ఈఎంఐ
చెల్లించాల్సి
ఉంటుంది.
అయితే
రూ.5
లక్షలు
ప్రీపేమెంట్
చేస్తే
ఈఎంఐ
రూ.38,500కి
తగ్గి
మెుత్తం
వడ్డీ
చెల్లింపులో
దాదాపు
రూ.12
లక్షలు
ఆదా
అవుతుంది.
రుణం
పొందేవారు
పాటించాల్సిన
మూడో
సూత్రం
ఫ్లోటింగ్
వడ్డీ
రేటును
ఎంచుకోవటం.
దీనివల్ల
వడ్డీ
రేటు
ఎల్లప్పుడూ
స్థిరంగా
ఉండదు.
ప్రస్తుతం
రెపో
రేటు
అధికంగా
ఉంది.
అయితే
రానున్న
కాలంలో
రిజర్వు
బ్యాంక్
వడ్డీ
రేట్లను
తగ్గించినప్పుడు
ఆ
ప్రయోజనం
పొందాలంటే
ఫ్లోటింగ్
వడ్డీ
రేటు
కింద
రుణాన్ని
తీసుకుని
ఉండాలి.
అయితే
ప్రస్తుతం
మార్కెట్లు
దాదాపు
అన్ని
సంస్థలు
ఇదే
పద్దతిని
ఫాలో
అవుతున్నాయి.
అయితే
రుణం
తీసుకునే
ముందు
ఫ్లోటింగ్
వడ్డీ
రేటుతో
సంబంధం
ఉన్న
నష్టాలు,
ప్రయోజనాలను
అర్థం
చేసుకోవడం
చాలా
ముఖ్యం.
చివరగా
ఈఎంఐ
భారాన్ని
తగ్గించుకోవటంలో
లెండర్‌ను
మార్చటం
కూడా
ఈఎంఐ
భారాన్ని
తగ్గించుకోవటానికి
దోహదపడుతుంది.
ఫ్లెక్సిబుల్
రీపేమెంట్
ఆప్షన్స్
అందించే
రుణ
సంస్థ
దగ్గరకు
లోన్
మార్చుకోవటం
వల్ల
ఖర్చులను
తగ్గించుకోవటంలో
సహాయపడుతుంది.
English summary
One should follow these 4 rules to reduce EMI burdens and save costs in Home Loan payments
One should follow these 4 rules to reduce EMI burdens and save costs in Home Loan payments
Story first published: Saturday, May 6, 2023, 18:14 [IST]