PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

How to get rid of ants: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. చీమల బాధ వదులుతుంది..!


పంచదార డబ్బా కనిపిస్తే వదిలిపెట్టవు.. అన్నం మిగిలితే హాంఫేట్‌ చెసేస్తాయి.. పప్పులు డబ్బాను కబ్జా చేసేస్తాయి.. గడపలు, గోడలు ఇలా ప్రతి దాన్లోనూ కన్నాలు పెట్టేస్తాయి.. ఇల్లు మొత్తం తమదే అన్నట్లు కలతిరుగుతాయి. ఇన్ని పనులు చేసేది ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు.. అందరి ఇంట్లో గుంపులు.. గుంపులుగా తిరిగుతూ ముప్పుతిప్పులు పెట్టే చీమలు. వర్షాకాలంలో చీమల దండు తిప్పలు ఇంకా పెరుగుతాయి. ఏ మూల చూసినా, వంట గదిలో ఏ డబ్బాలో చూసినా అవే కనిపిస్తాయి. అయితే చీమల నుంచి మనం ఎలా బయట పడాలి..?, చీమలు పట్టకుండా ఎలా మనం ఆహార పదార్థాలను ఎలా కాపాడుకోవాలి..? కొన్ని చిట్కాలు పాటిస్తే.. చీమలు మన ఇంటి నుంచి పారిపోతాయి. కెమికల్స్ వాడకుండా చీమలను బెడదను ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. (How to get rid of ants)

మిరియాలంటే భయపడతాయ్..

చీమల్ని తరిమి కొట్టడానికి మిరియాలు సహాయపడతాయి. మిరియాల ఘటుకు చీమలు పారిపోవడం ఖాయం. మీ కిచెన్‌ ర్యాక్స్‌లో కొన్ని మిరియాలు ఉంచండి. కిచెన్‌ ర్యాక్స్‌లో ఇలా మిరియాలు పెడితే.. ఆ ఘాటుకు చీమలు రావు.

పెప్పర్‌మింట్‌ సహాయపడుతుంది..

పెప్పర్‌మింట్‌ ఆయిల్‌తో చీమల బాధ నుంచి బయటపడవచ్చు. మీ కిచెన్‌ ర్యాక్‌లో లేదా చీమలు ఉన్న ప్రాంతంలో పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ను స్ప్రే చేయండి. దీని కోసం మీరు ముందుగా 10 నుంచి 20 చుక్కల వరకు పెప్పర్ మింట్ ఆయిల్‌ని రెండు కప్పుల నీళ్లలో వేసి కలపండి. స్ప్రే బాటిల్‌లో ఈ లిక్విడ్‌ వేసి.. చీమలు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేయండి. కిచెన్‌ ర్యాక్స్‌లో కూడా ఈ లిక్విడ్‌ స్ప్రే చేస్తే.. ఆహార పదార్థాలకు చీమలు పట్టవు. అయితే స్ప్రే చేసిన తర్వాత.. బాగా ఆరనివ్వండి. ఈ పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ స్ప్రే చేసేప్పుడు, మీ ఇంట్ల పెట్స్‌ దీనికి దూరంగా పెట్టండి.

టీ ట్రీ ఆయిల్ బెస్ట్‌..

చీమలను ఇంటి నుంచి బయటకు పంపించడానికి టీ ట్రీ ఆయిల్‌ మీకు హెల్ప్‌ అవుతుంది. ఐదు నుంచి పది చుక్కల టీ ట్రీ ఆయిల్‌ రెండు కప్పుల నీటిలో కలిపండి. ఆ తర్వాత స్ప్రే బాటిల్‌లో ఈ లిక్విడ్‌ తీసుకోండి. చీమలు పట్టే చోట, చీమలు ఉన్న ప్రాంతంలో ఈ లిక్విడ్‌ స్ప్రే చేయండి. లేదంటే.. లిక్విడ్‌లో కాటన్‌ బాల్స్ ముంచి, మీ కిచెన్‌ ర్యాక్‌లో ఉంచండి. ఇలా చేస్తే ఆహార పదార్థాలకు చీమలు పట్టకుండా ఉంటాయి.

వైట్ వెనిగర్..

వైట్ వెనిగర్ కూడా చీమల్ని తరిమి కొట్టడానికి సహాయ పడుతుంది. కెమికల్స్ లేకుండా చీమల బాధ నుంచి బయట పడడానికి ఇది కూడా బెస్ట్ ఆప్షన్. వైట్‌ వెనిగర్‌ను చీమలు ఎక్కువ పట్టే ప్రాంతంలో, వంటింటి ర్యాక్స్‌ దగ్గర స్ప్రే చేస్తే చీమలు రాకుండా ఉంటాయి.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క చీమల బాధ నుంచి రిలీఫ్‌ పొందడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క ఆయిల్‌లో కాటన్‌ బాల్స్‌ డిప్‌ చేసి, చీమలు తిరిగే ప్రాంతంలో పెట్టండి. వారానికి ఒక సారి కాటన్ బాల్స్ మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే చీమలు రాకుండా ఉంటాయి.

వేప నూనె..

చీమల బాధ వదిలించుకోవడానికి వేప నూనె బాగా పని చేస్తుంది. వేప నునెను మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒక 20 చుక్కల వేప నూనె రెండు కప్పుల నీటిలో వేసి.. స్ప్రే బాటిల్‌లో తీసుకోండి. ఆ తర్వాత ఈ లిక్విడ్‌ను చీమలు ఎక్కువగా ఉన్న చోట స్ప్రే చేయండి.

చీమలు పట్టకుండా ఉండాలంటే మీరు ఉపయోగించే డబ్బాలుకి జాగ్రత్తగా మూతలు పెట్టండి. వీలైతే టైట్‌గా వుండే డబ్బాలు మాత్రమే వాడండి. ఇళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే చీమలు చేరకుండా ఉంటాయి.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *