[ad_1]
How To Treat Low Blood Sugar: షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. ఇన్సులిన్‌పై ఆధారపడుతుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో బ్లడ్ షుగ్రర్ లెవల్స్ అమాంతంగా పడిపోతూ ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడాన్ని ‘తక్కువ హైపోగ్లైసీమియా అంటారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయి 70 mg/dL కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బ్లడ్ షుగర్ లెవల్ అంటారు. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్‌లో హైపోగ్లైసీమియా ఎక్కువగా కనిపిస్తుంది. తరచుగా, మీరు ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. డయాబెటిస్ లేని వారిలో హైపోగ్లైసీమియా చాలా అరుదుగా కనిపిస్తుంది. సమయానికి బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణ స్థాయికి తీసుకురాకపోతే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. హైపోగ్లైసీమియా కారణంగా.. కొమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో మరణం సభవిస్తుంది.
[ad_2]
Source link