News

oi-Mamidi Ayyappa

|

Hyderabad: అభివృద్ధిలో తెలంగాణ దేశానికి తలమానికగా నిలుస్తోందని మరోసారి రుజువైంది. ఈ క్రమంలో లండన్‌కు చెందిన అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సావిల్స్ ‘Hyderabad: The Sprint’ పేరుతో తాజాగా నివేదికను విడుదల చేసింది. దీనిలోని సమాచారం ప్రకారం హైదరాబాద్ భారతదేశ ఆర్థిక శక్తి కేంద్రంగా దూసుకుపోతోందని తెలుస్తోంది. మహానగరం ఆర్థికాభివృద్ధి కారణమైన అనేక అంశాలతో కూడిన నివేదికను సావిల్స్ బృందం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి KTRకి అందించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (IT-BPM), ఫార్మాస్యూటికల్స్ వృద్ధికి దోహదపడినట్లు నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం గ్లోబల్ కార్పోరేషన్‌ల కోసం అనేక రంగాలకు హైదరాబాద్ అత్యంత డిమాండ్ ఉన్న గేట్ వే నగరంగా ఉందని కేటీఆర్ తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాలు, పాలసీ సపోర్ట్, నాణ్యమైన రియల్ ఎస్టేట్ మెరుగైన జీవనాన్ని అందిస్తోందని అన్నారు. ఇలాంటి కారణాల వల్ల అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ ఉనికిని పెంచుకోవటం ద్వారా విస్తరించుకోవాలని భావిస్తున్నాయి. తరువాతి తరాలకు అత్యుత్తమ, పారదర్శకమైన వ్యాపార కేంద్రాన్ని సృష్టించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

Hyderabad: భారతదేశ ఆర్థిక శక్తిగా హైదరాబాద్.

కొత్త వ్యాపారాలను ఆకర్షించేందుకు వీలుగా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంలో తెలంగాణ ముందంజలో ఉందని ఆటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఆర్థిక విజయగాథ పాలసీ పుష్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అఫర్డబిలిటీ, హ్యూమన్ క్యాపిటల్ అనే నాలుగు కీలక కారకాలపై ఆధారపడి ఉందని ఇందులో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలే హైదరాబాద్‌ అభివృద్ధి కథనానికి శక్తినిచ్చాయని నివేదిక పేర్కొంది. దేశంలోని ఇతర ప్రధాన పట్టణ కేంద్రాలతో పోల్చిచూస్తే.. హైదరాబాద్ అధిక ఆర్థిక వృద్ధిని సాధించిందని నివేదిక పేర్కొంది.

ఇటీవల తెలంగాణలో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో రాష్ట్రం మంచి పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఈ క్రమంలో రాష్టంలో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు కోర్నింగ్, ఎస్జీడీ కంపెనీలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ప్రఖ్యాత కంపెనీలు సైతం తమ ఫార్మా పెట్టుబడులను ప్రకటించాయి.

English summary

Hyderabad as economic power house of india says Savills report ‘Hyderabad: The Sprint’

Hyderabad as economic power house of india says Savills report ‘Hyderabad: The Sprint’

Story first published: Monday, February 27, 2023, 12:55 [IST]





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *