Hyderabad: స్టాక్ మార్కెట్ నిబంధనల్లో మార్పులు… ట్రేడింగ్ సమయం పొడిగింపునకూ సై

[ad_1]

పెట్టుబడులే పరమావధి:

పెట్టుబడులే పరమావధి:

ఐటీ, దాని అనుబంధ సంస్థలు దూసుకుపోతుండటంతో.. 2023లో హైదరాబాద్, బెంగళూరులు 6 శాతం మేర వృద్ధి సాధించవచ్చని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ నగరాలు ముందుండటమే దీనికి కారణంగా పేర్కొంది. దేశీయంగానూ బెంగళూరు, డిల్లీలను వెనక్కి నెడుతూ.. కొత్త సంస్థల ప్రవేశంతో 34 శాతం ఆఫీస్‌ ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు నివేదించింది.

అగ్రరాజ్యానికీ తప్పని తిప్పలు:

అగ్రరాజ్యానికీ తప్పని తిప్పలు:

అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యంలోకి నెట్టాయని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. శ్రీలంక మరియు పాకిస్థాన్‌ తరహా దేశాల సంక్షోభాలు మాంద్యానికి సూచనలని హెచ్చరించింది. అగ్రరాజ్యం అమెరికా సహా యూరప్ దేశాలు కనీసం ఒక శాతం వృద్ధిని కూడా సాధించలేవని నివేదికలు వెలువడ్డాయి. ఈ తరుణంలో హైదరాబాద్, బెంగళూరులు సాధిస్తున్న పురోగతి.. భారత్‌కు ఎదుగుదలకు ప్రోత్సాహకరంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఆయా ప్రభుత్వాలు పనితీరు, పాలసీలను అభినందించి తీరాల్సిందే.

 విశ్వనగరంగా హైదరాబాద్‌...

విశ్వనగరంగా హైదరాబాద్‌…

వివిధ దేశాల్లోని పలు నగరాల రాజకీయ పరిస్థితులు, పెట్టుబడుల ఆకర్షణ, మాంద్యం ప్రభావం, స్థానిక ప్రభుత్వాల పనితీరు, పాలసీలతో పాటు మరిన్ని విషయాలను పరిగణలోనికి తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌ తెలిపింది. ఆఫీస్‌ ఆక్యుపెన్సీలో అగ్రగామిగా దూసుకుపోతున్న బెంగళూరుని తోసి రాజంటూ హైదరాబాద్ ముందుకు దూసుకుపోయినట్లు నివేదికలో వారు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చూడాలనుకుంటున్న ప్రజల ఆశలకు ఇది రెక్కలు తొడుగుతోంది. దేశీయంగా నిరుద్యోగితను తగ్గించడంలోనూ ఈ రెండు నగరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు.

 సెమీ కండక్టర్స్‌ కేంద్రంగా...

సెమీ కండక్టర్స్‌ కేంద్రంగా…

ఈనెల 8 నుంచి 12 వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వీఎల్ఎస్ఐ డిజైన్ కాన్ఫరెన్స్ 2023 గ్లోబల్ డిజిటలైజేషన్’లో సెమీ కండక్టర్ల పాత్రపై సదస్సు జరుగుతోంది. వాటిని సొంతంగా తయారు చేయాలని ఇప్పటికే గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. వివిధ స్టార్ట్‌అప్‌ల ప్రతినిధులు, ఇంజనీర్లు, విద్యార్థులు, ఐటి ఇండస్ట్రీకి చెందిన పలువురు అనుభవజ్ఞులు, పరిశోధకులు ప్రభుత్వంతో కలిసి ఈ విషయంపై ముందుకెళ్లాలని చూస్తున్నాయి. ప్రస్తుతం తైవాన్‌, చైనాలు వీటి తయారీలో అగ్రస్థానంలో ఉండగా.. ఇతర దేశాలు వాటిపై ఆధార పడాల్సి వస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి భారత్‌లో సెమీ కండక్టర్స్ తయారీ మొదలైతే.. సాంకేతికంగా పెను మార్పులు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *