News
oi-Mamidi Ayyappa
IBM
Jobs:
ఇన్నాళ్లుగా
టెక్కీలు
కట్టుకున్న
కలల
మేడలు
కూలిపోయే
సమయం
ఆసన్నమైనట్లు
కనిపిస్తోంది.
తక్కువ
కాలంలో
ఎక్కువ
సంపాదించొచ్చని
ఈ
రంగంపై
యువత
ఎక్కువగా
ఇన్నాళ్లు
మెుగ్గుచూపుతూ
వచ్చారు.
కానీ
ఇప్పుడు
వారి
కలలను
ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్
ఆవిరి
చేస్తోంది.
ప్రస్తుతం
ప్రపంచ
వ్యాప్తంగా
ఉన్న
టెక్
కంపెనీలు
ఎక్కువగా
ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్
వినియోగానికి
మారుతున్నాయి.
దీంతో
సాంప్రదాయ
టెక్
ఉద్యోగాలకు
ఎసరు
తప్పదని
తెలుస్తోంది.
మరో
పక్క
కంపెనీలు
తమ
ఖర్చులను
తగ్గించుకునేందుకు
కూడా
ఈ
ఆప్షన్లను
ఎంచుకుంటున్నాయి.
ఈ
క్రమంలో
అమెరికా
టెక్
దిగ్గజం
IBM
సంచలన
నిర్ణయం
తీసుకుంది.

రానున్న
సంవత్సరాల్లో
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్‌తో
భర్తీ
చేయవచ్చని
భావిస్తున్న
ఉద్యోగాల
కోసం
నియామకాలను
నిలిపివేయాలని
చూస్తోంది.
ఈ
ఉద్యోగాల
నియామకాలను
నిలిపివేయాలని
భావిస్తున్నట్లు
ఐబీఎమ్
సీఈవో
అరవింద్
కృష్ణ
వెల్లడించారు.
ఇందులో
భాగంగా
హ్యూమన్
రిసోర్సెస్
వంటి
బ్యాక్-ఆఫీస్
ఫంక్షన్లలో
రిక్రూట్మెంట్స్
నిలిపివేయటం
లేదా
నెమ్మదిస్తాయని
ఆయన
వెల్లడించారు.
నాన్-కస్టమర్-ఫేసింగ్
రోల్స్
కింద
దాదాపు
26,000
మంది
పనిచేస్తున్నట్లు
సీఈవో
వెల్లడించారు.
రానున్న
ఐదేళ్ల
కాలంలో
ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్,
ఆటోమేషన్
ద్వారా
దాదాపు
30
శాతం
ఉద్యోగాలు
తగ్గుతాయని
తాను
భావిస్తున్నట్లు
వెల్లడించారు.
అంటే
దాదాపు
7,800
ఉద్యోగాలు
పోతాయని
చెప్పకనే
చెప్పారు.
కస్టమర్
కేర్
సర్వీసెస్,
కోడింగ్
వంటి
ఉద్యోగాలను
ఏఐ
టూల్స్
ఆక్రమిస్తాయని
తెలుస్తోంది.
ఇది
జాబ్
మార్కెట్లో
పెను
సంచలనంగా
మారనుందని
తెలుస్తోంది.
ప్రస్తుతం
ఐబీఎమ్
సంస్థ
2,60,000
మంది
ఉద్యోగులను
కలిగి
ఉంది.
గత
ఏడాది
కంటే
ఇప్పుడు
టాలెంటెడ్
ఉద్యోగుల
లభ్యత
మార్కెట్లో
సులభతరమైందని
కృష్ణ
వెల్లడించారు.
ఈ
ఏడాది
ప్రారంభంలో
కంపెనీ
సుమారు
5000
మంది
ఉద్యోగులను
తొలగించింది.
భారీగా
ఖర్చులను
తగ్గించుకునే
ప్రణాళికలతో
ఇటీవలి
త్రైమాసికంలో
ఐబీఎమ్
మంచి
లాభాలను
అంచనా
వేస్తోంది.
English summary
US Tech Giant IBM planning to replace roles with Artificial Intelligence by pausing Hiring
US Tech Giant IBM planning to replace roles with Artificial Intelligence by pausing Hiring.
Story first published: Tuesday, May 2, 2023, 10:21 [IST]