Tuesday, August 3, 2021

Ikikai: డిజైన్ల ద్వారా సామాజిక స్పృహను మేల్కొలుపుతున్న సంస్థ

వేడీ వేడిగా కప్పు కాఫీ తాగుతూ ఏదో చర్చించుకుంటున్న మిత్ర బృందానిక ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. డిజైన్ల ద్వారా సామాజిక స్పృహ కల్పించాలన్న కొత్త ఆలోచన వారికి కలిగింది. ఈ డిజైన్ల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్న ఆర్టిస్ట్‌లకు చక్కటి అవకాశం ఇవ్వడం ద్వారా వారిని విజయతీరాలకు చేర్చాలని ఆలోచించారు. ఇక చిరు వ్యాపారాలు చేసే మహిళలు లేదా సామాజిక సంస్థలు లేదా ఎన్జీఓల బలోపేతానికి సహకరించాలన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఇకికాయ్.

ఇకికాయ్ అనే పేరు పై హమ్మింగ్ బర్డ్ లేదా తేనె పిట్ట ఉంటుంది. జపాన్ భాష నుంచి “ఇకి” అనే పదాన్ని తీసుకున్నారు. ఇకి అనే పదానికి అర్థం సౌదర్యం. “కాయ్” అంటే పునరుద్ధరణ అని అర్థం. ఇక ప్రత్యేకత, అందం, పరిస్థితులను వేగవంతంగా ఆవగింపు చేసుకోవడాన్ని సూచిస్తుంది హమ్మింగ్ బర్డ్.ఇకికాయ్ అనే ఈ సంస్థ ఈ పునాదుల పై నుంచే పుట్టుకొచ్చింది.

ఈ రోజుల్లో మీరు చేస్తున్న కొనుగోళ్లు మీరెలాంటి వారు, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీరు ఎలాంటి వాటిని విశ్వసిస్తారో చెప్పకనే చెబుతాయి. అదే మాదిరిగా ఆలోచనలను ఆచరణలో పెట్టడమే ఇకికాయ్‌ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే ఇకికాయ్ నుంచి వచ్చే డిజైన్లు సామాజిక మరియు పర్యావరణ స్పృహతో కూడిన జీవన శైలి గురించి వివరిస్తాయి. ఇకికాయ్ సంస్థ నుంచి పలు వైవిధ్యమైన డిజైన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ హితంతో కూడిన డిజైన్లు కచ్చితంగా మంచిని వ్యాప్తి చేసేలా ప్రేరేపిస్తాయి.

ఇకికాయ్ సంస్థను ఇషా, క్షీరా, పరాగ్‌ అనే ముగ్గురు అనుభవజ్ఞులైన నిపుణుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. సానుకూల మార్పును సమీకరించాలన్న ఉద్దేశంతో ఇకికాయ్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు. డిజైన్ల ద్వారా మంచిని వ్యాప్తి చేయడం కచ్చితంగా ప్రతి ఒక్కరి మనస్సును తాకుతుందని, కదిలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిని వ్యాప్తి చేసేందుకు చాలామంది కదిలి వస్తున్నారని చెప్పారు. మంచిన వ్యాప్తి చేయడంలో సౌందర్యం అనేది ఒక ఆయుధంగా లేదా మార్గంగా మలుచుకుంటామని చెప్పారు.

నేటి వినియోగదారులు రేపటి భవిష్యత్తు కోసం మంచి ఆలోచనతో ముందడుగు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.తద్వారా మంచి సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్న విశ్వాసం తమకుందని వెల్లడించారు. ఇలాంటి ప్రయాణం చేయాలనుకునేవారికి ఇకికాయ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని చెప్పారు. మంచి చేద్దాం అనుకునేవారు కచ్చితంగా తమ వెబ్‌సైట్‌ www.ikikai.coను సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Source link

MORE Articles

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

మోడీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్: అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా...

Benefit of banana health: रोज 1 केला सेहत के लिए कर सकता है कमाल, बस जान लीजिए सेवन का सही टाइम

benefit of banana health: आज हम आपके लिए केला के फायदे लेकर आए हैं. केला सबसे ज्यादा एनर्जी देने वाला फल है. खास...

Wife: అదే విషయంలో గొడవలు, ఏంచేస్తావు అని ఎదురు తిరిగిన భార్య, స్పాట్ లో చంపేసిన భర్త !

బెంగళూరులో కాపురం ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లో సయ్యద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సయ్యద్, బేబి అయోషా అే...

చంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యం

మా ప్రభుత్వం రాగానే అంతకంత చూపిస్తాం అంటాడు బాబు తాజాగా చట్టం చేతికి చిక్కిన తన దొంగల ముఠా సభ్యులను వెనకేసుకు వస్తూ ప్రభుత్వంపై బాబు ఏమని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe