చిత్రా లవ్ మ్యారేజ్
తమిళనాడులోని తేని జిల్లాలోని చిన్నమన్నూర్ ప్రాంతంలో అన్బరసన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నమన్నూర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్న చిత్రా (24) అనే యువతి అన్బరసన్ కు ముందే పరిచయం ఉంది. నాలుగు సంవత్సరాలు చిత్రా వెంట తిరిగిన అన్బరసన్ ఆమెను ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

కోయంబత్తూరులో కొత్త కాపురం
వివాహం జరిగిన తరువాత అన్బరసన్. చిత్రా దంపతులు కోయంబత్తూరులోని కరుమతంపట్టి సమీపంలోని ఇందిరానగర్ లో కాపురం పెట్టారు. అన్బరసన్, చిత్రా దంపతులకు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలు పుట్టే వరకు అన్బరసన్ భార్య చిత్రాతో సక్రమంగానే కాపురం చేశాడు.

అక్రమ సంబంధాలు….. అడ్డమైన తిరుగుళ్లు
భార్య చిత్రా పుట్టింటి వాళ్లు సర్దుకుపోవడంతో ఆమెకు బంగారు నగలు తీసిచ్చారు. భార్య చిత్రా పుట్టింటి నుంచి తీసుకువచ్చిన బంగారు నగలు కుదువ పెట్టిన అన్బరసన్ స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో కొందరు వివాహిత మహిళలు, ఆంటీలతో అన్బరసన్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం.

పెళ్లాంకు తెలిసి ఇంట్లో గొడవలు
తన భర్త వివాహిత మహిళలు, ఆంటీలతో అన్బరసన్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం తెలియడంతో చిత్రా గొడవ పెట్టుకుంది. ఇదే సమయంలో తప్పించుకోవడానికి అన్బరసన్ పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురావాలని చిత్రాకు చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు.

పెద్దల పంచాయితీలు…. స్ట్రాంగ్ వార్నింగ్
పెద్దలు అనేకసార్లు పంచాయితీలు చేసి అన్బరసన్ కు బుద్దిమాటలు చెప్పినా అతను మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది. గత శనివారం చిత్రా కుటుంబ సభ్యులు వెళ్లి ఇద్దరికి సర్దిచెప్పారు. చివరికి ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదని చిత్రా కుటుంబ సభ్యులు అన్బరసన్ కు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.

వీడు మారడు…. నేనే వెళ్లిపోతే ?
తన భర్త అన్బరసన్ మారడని చిత్రా డిసైడ్ అయిపోయింది. పక్కింటిలో నివాసం ఉంటున్న బంధువులు గుడికి వెలుతున్న విషయం తెలుసుకున్న చిత్రా ఆమె ఇద్దరు కుమార్తెలను వారితో పంపించింది. తరువాత ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో చిత్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మొగుడు ఫ్యామిలీనే కారణం ?
రాత్రి ఇంటికి వెళ్లిన అన్బరసన్ భార్య ఉరి వేసుకున్న విషయం గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్త అన్బరసన్, ఆమె తల్లిదండ్రుటు, అన్బరసన్ సోదరి రోహిణి చిత్రహింసలకు గురి చేశారని, అందుకే చిత్రా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. చిత్రా అంత్యక్రియలకు ఆమె భర్త అన్బరసన్ రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్బరసన్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.