Internet shutdown: నిమిషం ఇంటర్‌ నెట్ ఆగితే ఎంత నష్టమో తెలుసా ??

[ad_1]

సోషల్‌ మీడియాదే సింహభాగం

సోషల్‌ మీడియాదే సింహభాగం

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ కు సంబంధించిన డేటాను ‘టాప్‌10వీపీఎన్‌’ అనే సంస్థ విశ్లేషించింది. ఆయా సమయాల్లో అంతర్జాల వినియోగం నిలిపివేయడం వల్ల ఎంత మేర నష్టం జరిగిందో పేర్కొంటూ ఓ నివేదికను విడుదల చేసింది. కోట్లాది మంది వినియోగిస్తున్న గూగుల్, ఫేస్‌ బుక్, వాట్సప్, ఇన్‌ స్టా సేవలు ఆగిపోతే ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోతుందో చూద్దాం..

నష్టాల సునామీనే

నష్టాల సునామీనే

భారత్‌ లో 2022కి గాను 1,533 గంటలు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం వల్ల 184 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్లు టాప్‌10వీపీఎన్‌ తెలిపింది. అంటే మన కరెన్సీలో దాదాపు నిమిషానికి లక్షా 63 వేల రూపాయలన్న మాట. 2021లో 1,157 గంటలకు గాను ఈ ఖర్చు 582.8 మిలియన్ డాలర్లుగా తేలినట్లు పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2022 లో 50 వేల 95 గంటలకు గాను మొత్తం 23.8 బిలియన్‌ డాలర్లు ఖర్చయినట్లు పేర్కొంది. 2021తో పోలిస్తే ఇది 45 శాతం అధికం కావడం గమనార్హం. ఇందులో మొదటి స్థానాన్ని రష్యా ఆక్రమించగా, ఇరాన్‌, కజకిస్తాన్‌ లు వెనువెంటనే ఉన్నాయి.

ఇంటర్నెట్ ఎందుకు ఆగుతుంది?

ఇంటర్నెట్ ఎందుకు ఆగుతుంది?

పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ పై ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తుంటాయి. ఆయా జిల్లాలు, నగరాలు, గ్రామాల్లో సైతం అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న చోట ప్రభుత్వాలే అంతర్జాల వినియోగాన్ని కొంత కాలం పాటు పూర్తిగా అడ్డుకుంటాయి.

2019 నుంచి చూస్తే 53 దేశాల్లో ప్రధానంగా 380 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్‌ లు జరిగాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 41.5 బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా.

ఎక్కువ సార్లు ఆగింది ట్విట్టరే..

ఎక్కువ సార్లు ఆగింది ట్విట్టరే..

దేశంలో 2022కి గాను 120 మిలియన్లు, 2021లో 59 మిలియన్ల జనాభా ఈ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత వల్ల ప్రభావితమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 710 మిలియన్లుగా ఉంది. 2021తో పోలిస్తే 41 శాతం అధికం. మొత్తం సోషల్‌ మీడియా 82 గంటలు బ్లాక్ చేయబడగా.. ఎక్కువగా నిలిపివేసిన సామాజిక మాధ్యమంగా ట్విట్టర్ రికార్డు సృష్టించింది. మానవ హక్కుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి రాజస్థాన్‌ లో 363, జమ్మూ & కశ్మీర్‌ లో 309 గంటల పాటు అంతర్జాల సేవలను భారత ప్రభుత్వం నిలిపివేసింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *