[ad_1]
News
oi-Chekkilla Srinivas
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ డిసెంబర్ 2022లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసింది. డిసెంబర్ 31, 2022 నాటికి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 56,061 బ్యాంక్ షేర్లును కొనుగోలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,21,764 షేర్లను కొనుగోలు చేసింది.
ఈ రెండు స్టాక్‌లు కాకుండా, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలో మరో ఆరు స్టాక్‌లను జోడించింది. ఆరు కొత్త పోర్ట్‌ఫోలియో స్టాక్‌లలో గెయిల్, బెర్గర్ పెయింట్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో PSU బ్యాంక్ షేర్లు పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించాయి. డాలర్ రేట్లు పెరగడం వల్ల క్రెడిట్ లైన్ కోసం విదేశాలకు మారిన పెద్ద కార్పొరేట్లు తమ ప్రాజెక్టులకు క్రెడిట్ లైన్ కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల వైపు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆర్బీఐ రెపో రేట్ పెంచుతుండడంతో PSU బ్యాంకులకు సంబంధించి మార్కెట్ సెంటిమెంట్లు సానుకూలంగా ఉన్నాయి.
2023 బడ్జెట్‌కు ముందు పీఎస్‌యు బ్యాంక్ షేర్లలో పెరుగుదలను ఆశిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్‌లోని డెరివేటివ్ & టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపారియా చెప్పారు. స్వల్పకాలిక లక్ష్యం కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడి పెట్టొచ్చని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ చెప్పారు.
English summary
Invesco Mutual Fund bought stakes in Bank of India and Union Bank of India in December 2022
Invesco Mutual Fund bought stakes in Bank of India and Union Bank of India in December 2022
Story first published: Saturday, January 21, 2023, 12:44 [IST]
[ad_2]
Source link
Leave a Reply