News
oi-Mamidi Ayyappa
Mutual
Funds:
ఈ
రోజుల్లో
తల్లిదండ్రులు
తమ
పిల్లల
భవిష్యత్తును
దృష్టిలో
ఉంచుకుని
వారు
చిన్న
వయస్సులో
ఉన్నప్పటి
నుంచే
పెట్టుబడులను
పెడుతున్నారు.
ఈ
క్రమంలో
ఎక్కువ
మంది
మంచి
రాబడులను
అందించే
మ్యూచువల్
ఫండ్స్
కోసం
వెతుకున్నారు.
తల్లిదండ్రులు
తమ
పిల్లల
కోసం
పెట్టుబడి
పెట్టాలనుకుంటే
వారికి
SBI
మ్యూచువల్
ఫండ్
మంచి
ఆప్షన్
గా
మారింది.
SBI
మ్యూచువల్
ఫండ్
ఈ
ప్లాన్‌ను
29
సెప్టెంబర్
2020న
ప్రారంభించింది.
ఈ
స్కీమ్
పేరు
SBI
మాగ్నమ్
చిల్డ్రన్
బెనిఫిట్
ఫండ్.
మూడేళ్ల
కిందట
ప్రారంభమైన
ఈ
స్కీమ్
మంచి
రాబడులను
అందించింది.

ఇన్వెస్టర్ల
డబ్బు
రెండింతలైంది.
అప్పట్లో
రూ.10గా
ఉన్న
స్కీమ్
ఎన్ఏవీ
ప్రస్తుతం
రూ.24.48గా
ఉంది.
ప్రస్తుతం
ఈ
స్కీమ్
కింద
మెుత్తం
రూ.851
కోట్ల
నిధులు
పెట్టుబడులుగా
ఉన్నాయి.
ఈ
క్రమంలో
ఎవరైనా
ఇన్వెస్టర్
సెప్టెంబర్
29,
2020న
రూ.లక్ష
పెట్టుబడి
పెట్టినట్లయితే
ఇప్పుడు
దాని
విలువ
రూ.2.44
లక్షలుగా
మారింది.
ఈ
క్రమంలో
ఫండ్
దాదాపు
145
శాతం
రాబడిని
అందించింది.
ఇదే
కేటగిరీలోని
ఇతర
ఫండ్స్
కంటే
కంపెనీ
గడచిన
ఏడాది
కాలంలో
మెరుగైన
పనితీరును
కనబరిచింది.
రెండేళ్ల
కాలంలో
ఈ
కేటగిరీలో
ఇతర
ఫండ్స్
10.30
శాతం
రాబడిని
అందించగా..
SBI
మాగ్నమ్
చిల్డ్రన్
బెనిఫిట్
ఫండ్
మాత్రం
26.97
శాతం
రాబడిని
ఇచ్చింది.
రూ.10
వేల
చొప్పున
ఎస్ఐపీ
రూపంలో
పెట్టుబడి
పెట్టిన
ఇన్వెస్టర్లకు
ఈ
ఫండ్
23
శాతం
రాబడితో
మెుత్తాన్ని
రూ.4.26
లక్షలు
చేసింది.
మ్యూచువల్
ఫండ్
స్కీమ్‌లలో
ఎక్కువ
కాలం
ఇన్వెస్ట్
చేస్తే
చాలా
మంచి
రాబడులను
పొందవచ్చని
బీపీఎన్
ఫిన్‌క్యాప్
డైరెక్టర్
ఎకె
నిగమ్
తెలిపారు.
పిల్లల
కోసం
దీర్ఘకాలిక
పెట్టుబడి
వారి
భవిష్యత్తును
చక్కదిద్దడానికి
చాలా
మంచిదని
ఆయన
పేర్కొన్నారు.
English summary
SBI Magnum Children’s Benefit Fund giving better returns, Know details
SBI Magnum Children’s Benefit Fund giving better returns, Know details
Story first published: Thursday, May 11, 2023, 13:55 [IST]