Investment Ideas: 2023లో లాభాలు కావాలా..? అయితే ఈ స్టాక్స్ లిస్ట్ చూడండి..

[ad_1]

ICICI బ్యాంక్..

ICICI బ్యాంక్..

బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.. ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని ఐసీఐసీఐ నిరంతర కస్టమర్ ఫోకస్, డిజిటల్ సామర్థ్యాలు, స్థూల మార్కెట్ ఆధారిత విధానం సెప్టెంబర్‌లో బలమైన రిటైల్ వృద్ధి 25%, SMB వృద్ధి 36%కి దారితీసిందని ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ కు చెందిన విక్రమ్ కసత్ చెప్పారు. ఇది ఇంకా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నందున స్టాక్ వచ్చే ఏడాది మంచి రాబడులను అందించగలదని వారు విశ్వసిస్తున్నారు.

సిప్లా..

సిప్లా..

ఫార్మా రంగంలో భారత ప్రఖ్యాత సంస్థ సిప్లా. భారత్, యుఎస్‌తో సహా మరిన్ని దేశాల్లో సిప్లా బలమైన వృద్ధిని సాధించింది. కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరింపజేస్తూనే.. మరో పక్క మెడికల్ పోర్ట్‌ఫోలియోను కూడా పెంచుకుంటూ పోతోంది. ఈ కారణాలతో కంపెనీ 2023 ద్వితీయార్థంలో మంచి వృద్ధిని చూడవచ్చని బ్రోకరేజ్ పేర్కొంది.

HDFC బ్యాంక్..

HDFC బ్యాంక్..

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని వృద్ధి చేస్తూనే ఉంది. పైగా కంపెనీ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. కంపెనీ క్రెడిట్ కార్డ్ వ్యాపారం కూడా మెరుగుపడింది. ఆర్థిక సంస్థ HDFC కూడా త్వరలో బ్యాంకింగ్ వ్యాపారంలో విలీనం కానుంది. వ్యాపార వృద్ధి పెంచుకోవటానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. అందుకే బ్రోకరేజ్ దీని టార్గెట్ ధరను రూ.1,908గా నిర్ణయించింది.

ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్..

దేశీయ ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ టాప్ స్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ దేశాల వృద్ధిరేటు కొనసాగుతుండడంతో ఐటీ రంగం త్వరలో పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఇన్ఫోసిస్ వృద్ధి రేటు కూడా పెరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈలోగా దీని షేరు ధర పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారి అంచనా. ద్రవ్యోల్బణం నుంచి అన్ని దేశాలు క్రమంగా బయటపడుతున్నందున 2023లో కంపెనీ వ్యాపారం తిరిగి గాడిన పడవచ్చని ఇది సూచిస్తోంది.

హిందుస్థాన్ యూనిలివర్..

హిందుస్థాన్ యూనిలివర్..

హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ రాబోయే పండుగ సీజన్‌లో డిమాండ్‌ను పునరుద్ధరించవచ్చు. దీని వల్ల కంపెనీ లాభదాయకత పెరగటంతో పాటు సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్, పర్ఫెక్ట్ సీజన్ కావడంతో గ్రామీణ మార్కెట్లు కూడా కోలుకుంటున్నాయి. దీని వల్ల కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఇది దాని మార్జిన్ నిష్పత్తిని మెరుగుపరిచి ఇన్వెస్టర్లకు మంచి రాబడిని ఇస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంది.

HDFC లైఫ్..

HDFC లైఫ్..

దేశంలో ఇన్సూరెన్స్ పై అవగాహన పెరుగుతూనే ఉంది. కరోనా తర్వాత ప్రైవేట్ బీమా సంస్థ HDFC లైఫ్ వృద్ధి కూడా పెరిగింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ.. ఖర్చుల తగ్గింపుపై దృష్టి సారించింది. ఇది లాభదాయకతను మెరుగుపరచటంలో దోహదపడుతోంది. కాబట్టి ఇన్వెస్టర్ల ఎంపికకు సరైన స్టాక్ అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు రానున్న ఏడాది ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను సైతం బ్రోకరేజ్ సిఫార్సు చేసింది.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు చేయకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *