[ad_1]
రిలయన్స్ జియో..
లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ మార్కెట్లో పెను సంచలనంగా మారాలని నిర్ణయించినట్లు సమాచారం. గత సంవత్సరం JioCinema యాప్‌లో FIFA వరల్డ్ కప్ మ్యాచ్ లను పూర్తిగా ఉంచి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షకులకు అందించింది. దేశంలోని అతిపెద్ద టెల్కో ఇప్పుడు ఐపీఎల్ విషయంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని చూస్తోంది.
2022 సీజన్లో..
రిలయన్స్ యాజమాన్యంలోని వయాకామ్ 18 ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ల ప్రసారానికి హక్కులను 2022లోనే కొనుగోలు చేసింది. దీంతో డిజిటల్ మీడియా హక్కులను దక్కించుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఏకంగా రూ.23,758 కోట్లను వెచ్చించింది. ఫుట్‌బాల్ టోర్నమెంట్ డిజిటల్ హక్కులను Viacom18 కలిగి ఉన్నందున JioCinema అన్ని FIFA ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ప్రేక్షకులు వీటిని యాప్ తో పాటు Sports18, Sports18 HD వంటి టీవీ ఛానెళ్లలోనూ ప్రసారం చేయటం మనందరికీ తెలిసిందే.
మార్కెట్ పెనిట్రేషన్..
మెుదటి నుంచి రిలయన్స్ జియో గ్రూప్ తన సేవలను వినియోగదారులకు పరిచయం చేసేందుకు పెనిట్రేటింగ్ స్ట్రాటజీని ప్రయోగిస్తోంది. తాజాగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ మార్కెట్ విషయంలోనూ ఇదే పద్దతిని అవలంభించాలని చూస్తోంది. దీనికోసం Viacom18 అనేక వ్యూహాలను అన్వేషిస్తోందని మూలాల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్ కూడా మార్కెట్ వాటాను కార్నర్ చేయడానికి ఉచితంగా ఉత్పత్తులను అందించవచ్చని నివేదిక జోడించింది.
ప్రాంతీయ భాషల్లో..
Viacom18 దేశంలోని ప్రాంతీయ భాషల్లో IPLని ఉచితంగా ప్రసారం చేయాలని యోచిస్తోంది. జియో టెలికాం సబ్‌స్క్రైబర్లు లైవ్ స్ట్రీమ్‌ను ఉచితంగా యాక్సెస్ చేయగలరని తెలుస్తోంది. అయినప్పటికీ కంపెనీ ఇప్పటికీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ప్యాకేజీలను అందించడం కొనసాగిస్తుందని సమాచారం. మెుత్తానికి మార్కెట్ ను ఒడిసిపట్టేందుకు రిలయన్స్ జియో తన పాత అస్త్రాన్నిమళ్లీ తెరమీదకు తెస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
[ad_2]
Source link
Leave a Reply