[ad_1]
జొమాటో షేర్..
దేశంలోని ఫుడ్ డెలివరీ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న జొమాటో స్టార్టప్ గత ఏడాది మార్కెట్లోకి ఐపీవోగా వచ్చింది. అయితే ఆసమయంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ కంపెనీ ఐపీవోలో డబ్బు పెట్టుబడిగా పెట్టేందుకు ఎగబడ్డారు. అయితే లిస్టింగ్ సమయంలో షేర్లు పొందినవారు మంచి లాభాలను ఆర్జించారు కూడా. అలా ఒక వ్యక్తి ఏకంగా కోట్లు సంపాదించారు.
అష్నీష్ గ్రోవర్..
BharatPe సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ వ్యాపార ప్రపంచంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. గ్రోవర్ సైతం జొమాటో ఐపీవోలో పెట్టుబడి పెట్టారు. అయితే జొమాటో షేర్ల లిస్టింగ్ రోజున కేవలం 8 నిమిషాల్లోనే రూ.2.25 కోట్లను ఆయన ఆర్జించారు. ఈ విషయాలను ఆయన తాజాగా ‘డూప్లిసిటీ: ది హార్డ్ ట్రూత్ ఎబౌట్ లైఫ్ అండ్ స్టార్ట్-అప్స్’ అనే పుస్తకంలో వెల్లడించారు. ఇందుకోసం జొమాటో షేర్లలో దాదాపుగా రూ.100 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత కోటక్ గ్రూప్‌తో వివాదం కారణంగా Nykaa IPOలో బెట్టింగ్‌ను కోల్పోయినట్లు తన పుస్తకంలో వెల్లడించారు.
రూ.100 కోట్లు ఎక్కడివి..
అశ్నీర్ గ్రోవర్ ఇంత భారీ మొత్తాన్ని ఎలా అరేంజ్ చేసుకున్నారనే విషయాలను సైతం తన పుస్తుకంలో వెల్లడించారు. ఈ ఐపీవోలో పెట్టుబడి కోసం తన వద్ద ఉన్న రూ.5 కోట్ల సొంత నిధులను పెట్టుబడి పెట్టాడు. దీనికి తోడు మిగిలిన రూ.95 కోట్లను 10 శాతం వార్షిక వడ్డీ రేటుకు కోటక్ వెల్త్ నుంచి ఒక వారానికి లోన్ గా తీసుకున్నాడు. ఈ వారం రోజులకు అతనికి రూ.20 లక్షలు వడ్డీగా చెల్లించినట్లు తన పుస్తుకంలో గ్రోవర్ వెల్లడించారు. అలా గ్రోవర్ సొంత డబ్బు లేకుండానే రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఐపీవో ఆదాయాన్ని పొందారు.
జొమాటో నష్టాలు..
జొమాటో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.76కు కంపెనీ విడుదల చేయగా.. లిస్టింగ్ సమయంలో షేర్లు రూ.115 వద్ద మార్కెట్లోకి వచ్చాయి. అష్నీర్ గ్రోవర్ తాను కొన్న షేర్లను రూ.136 ధర వద్ద విక్రయించారు. ఆ సమయంలో వడ్డీ ఖర్చులతో కలుపుకుని ఒక్కో షేర్ ధర రూ.82-85 వద్ద ఉంది. అలా ఆయన మెుత్తంగా రూ.2.25 కోట్లను ఆర్జించారు. అయితే జొమాటో షేర్ల నుంచి బంపర్ లాభాలను ఆర్జించిన తర్వాత.. షేర్ ధర క్రాష్ కావటంతో గ్రోవర్ రూ.25 లక్షల నష్టాన్ని చవిచూశారు.
ప్రస్తుతం షేర్ పరిస్థితి..
టెక్ స్టార్టప్ షేర్లు ప్రస్తుతం ఇష్యూ సమయంలో ఉన్న ధర కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. జూలై 27, 2022న స్టాక్ తన ఆల్ టైమ్ కనిష్ఠమైన రూ.40.55ను చేరుకుంది. ఈ రోజు జొమాటో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.59 వద్ద ఉంది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.142.45 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.40.60 వద్ద ఉంది.
[ad_2]
Source link