మార్కెట్లోకి కొత్త ఐపీవో..
ఈ వారం మార్కెట్లోకి మరో కొత్త ఐపీవో రాబోతోందనే శుభవార్త చాలా మంది ఇన్వెస్టర్లను సంతోషానికి గురిచేస్తోంది. నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ తన ఐపీవోను మార్చి 15న ఐపీవో కోసం మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇది SME IPO క్యాటగిరీలో జాబితా చేయబడనుంది. ఈ ఐపీవో ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ కానుంది.

గ్రేమార్కెట్ ప్రీమియం..
ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి అడుగుపెడుతున్న స్టాక్ రూ.3 గ్రే మార్కెట్ ప్రీమియంతో ఉంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ 2,050,800 కొత్త షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీవో నుంచి మెుత్తం రూ.20.30 కోట్లను సేకరించాలని లక్ష్యంగా మార్కెట్లోకి వస్తోంది. నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీకి ముందే కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి.

IPOలో గమనించాల్సిన విషయాలు..
1. నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ పబ్లిక్ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.99గా కంపెనీ నిర్ణయించింది.
2. నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ IPO మార్చి 15న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. మార్చి 20, 2023 వరకు బిడ్డింగ్ కోసం తెరిచి ఉంటుంది.
3. ఈ IPO ద్వారా రూ. 20.30 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
4. రిటైల్ ఇన్వెస్టర్ ఈ ఇష్యూలో కనీసం ఒక లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక లాట్‌లో 1200 షేర్లు ఉంటాయి.
5. షేర్ల కేటాయింపు తాత్కాలిక తేదీ మార్చి 23, 2023.
6. NSE SME ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ కోసం IPO ప్రతిపాదించబడింది. మార్చి 28, 2023న స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడే అవకాశం ఉంది.
7. బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ SME IPOకి అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించబడింది.