[ad_1]
సర్వే ప్రకారం..
తాజా సర్వే ప్రకారం ఎక్కువ మంది యువత ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో టెక్ రంగంలోని చాలా కంపెనీలు ఉద్యోగుల కోతలను ప్రకటించిన క్రమంలో ఈ సర్వే నిర్వహించటం జరిగింది. ఉద్యోగుల తొలగింపులు, జీతాల్లో కోతలు వంటి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ.. మార్కెట్లో ఐటీ రంగంపై మక్కువ తగ్గలేదని ఈ సర్వే చెబుతోంది.
టెక్ రంగంలో ప్రాధాన్యత..
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 70% మంది టెక్ రంగంపై తమకు ఉన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ అధ్యయనంలో 79% మంది కంపెనీ తమకు తగిన అవకాశాన్ని అందిస్తే రెండేళ్ల కంటే ఎక్కువ కాలం తమ ఉద్యోగంలో ఉండటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగంలో దాదాపుగా 3,80,000 మంది ఫ్రెషర్లు ఉపాధి పొందుతారని అంచనా వేయబడింది.
ఐటీ కంపెనీల ప్లాన్ ఏంటి..?
వర్క్‌ప్లేస్‌లు, వర్క్‌ఫోర్స్‌లు మారుతున్నాయని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా అన్నారు. ఇదే క్రమంలో కంపెనీలు ప్రతిభ కలిగిన ఉద్యోగులను నిలుపుకోవటానికి కొత్త ప్రోగ్రామ్‌లు, ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడానికి కొత్త కోర్సులు మొదలైనవి అవలంబిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ఐటీ రంగానికి కొత్త రూపాన్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
హైబ్రిడ్ మోడల్..
ప్రస్తుతం 85% మంది ఆఫీసు, హోమ్ వర్క్‌ల హైబ్రిడ్ మోడల్ ను ఇష్టపడుతున్నారు. అందుకే కంపెనీలు సైతం దీనికి అనుగుణంగా వెసులుబాటును తీసుకొస్తున్నాయి. Gen Z(1997-2012 మధ్య జనం) ఉద్యోగులు తమ పని-జీవిత సమతుల్యతను సరిగ్గా పొందడం గురించి తరచుగా ఆందోళన చెందుతారు. పనితో పాటు కుటుంబానికి సమ ప్రాధాన్యతను ఇచ్చేందుకు ప్రయత్నించటం కూడా హైబ్రిడ్ విధానానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
తొలగింపులు సాధారణమే..
ఐటీ పరిశ్రమలో ఇదొక సైకిల్ అని ఇటీవలి థీసిస్ పేర్కొంది. అలా బూమ్ రావటం తర్వాత ఉద్యోగాలు తొలగింపబడటం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. పరిస్థితులు తిరిగి గాడిలో పడగానే నియామకాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మాంద్యం భయాలు కొంత తొలగితే వృద్ధి ఖచ్చితంగా మెుదలవుతుందని వారు అంటున్నారు. ప్రస్తుత ఏడాది ఐటీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. దానిపై యువతలో ఆసక్తి తగ్గటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నియామకాలు వచ్చే ఏడాది తిరిగి పుంజుకుంటాయని తాజా అధ్యయనం చెప్పడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply