IT News: ఫెషర్స్ తొలగింపులపై షాకింగ్ నిజాలు.. ఈ సారి ఎంత మంది జాబ్స్ పోతాయంటే..?

[ad_1]

ఫ్రెషర్ల విషయంలో..

ఫ్రెషర్ల విషయంలో..

కరోనా తర్వాత భారతీయ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్లను చాలా వరకు తగ్గించాయి. తక్కువ సంఖ్యలో మాత్రమే గ్రాడ్యూయేట్లను నియమించుకున్నాయి. అయితే ప్రస్తుతం సంక్షోభం సమయంలో ముందుగా వీరి ఉద్యోగాలే కోతకు గురవుతున్నాయి. కంపెనీలు వీరికి స్కీనింగ్ టెస్టులు పెట్టి అందులో ఉత్తీర్ణులు కానివారిని తొలగిస్తున్నాయి. శిక్షణ అనంతరం తక్కువ పనితీరు కలిగి ఉన్న ఫ్రెషర్లను ఇప్పుడు దేశంలోని ఐటీ కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తోంది.

తాజా అంచనాలు..

తాజా అంచనాలు..

ప్రస్తుత తొలగింపుల సీజన్ లో దేశీయ ఐటీ కంపెనీలు దాదాపు 2500 మంది ఫ్రెషర్లను తొలగిస్తాయని కెరీర్‌నెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్షుమన్ దాస్ అన్నారు. క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా నియమితులైన ఏడాది లోపు స్క్రీనింగ్ పరీక్షలు సాధారణంగా ఐటీ కంపెనీల్లో జరుగుతుంటాయి. వీటి ద్వారా ఎంపికైన ఫ్రెషర్లు కొనసాగుతున్న క్లయింట్ ప్రాజెక్ట్‌ల అవసరాలకు సరిపోతారా.. లేదా అనే విషయాన్ని కంపెనీలు పరీక్షిస్తుంటాయి.

ఇన్ఫోసిస్.. విప్రో

ఇన్ఫోసిస్.. విప్రో

2023 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు 2 లక్షల మందికి స్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే వారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే ఈ పరీక్షలను క్లియర్ చేయకపోవచ్చని దాస్ అంచనా వేశారు. ఇటీవల ఇన్ఫోసిస్ ఇదే తరహాలో దాదాపు పరీక్షలో విఫలమైన 600 మందిని ఇంటికి పంపింది.

అలాగే విప్రో సైతం కొన్ని వందల మందిని వదిలేసుకున్నట్లు వెల్లడైంది. ఫ్రెషర్లు పదేపదే అసెస్‌మెంట్‌లలో పేలవమైన పనితీరు కనబరుస్తున్నందున దాదాపు 452 మందిని వదులుకున్నట్లు ఇటీవల విప్రో ప్రకటించింది.

ఆందోళనలో ఫ్రెషర్లు..

ఆందోళనలో ఫ్రెషర్లు..

కంపెనీలు స్కీనింగ్ పరీక్షల నెపంతో తొలగించటంపై చాలా మంది ఫ్రెషర్లు ఆందోళన చెందుతున్నారు. ఆఫర్ లెటర్లు అందుకుని చాలా నెలలు వేచిచూసిన తర్వాత కొంత మంది తొలగించబడుతున్నారు. మరికొందరి విషయంలో ఆన్ బోర్డింగ్ అయిన కొన్ని నెలల తర్వాత ఇలా ఉద్యోగాలను కోల్పోవాల్సి రావటంపై కన్నీటి పర్యంతమౌతున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *