PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

IT news: విప్రో Q4 వృద్ధిలో క్షీణతకు కారణాలివీ.. FY24 Q1 అంచనాలు ఎలా ఉన్నాయంటే..


News

lekhaka-Bhusarapu Pavani

|

IT
news:
టెక్
దిగ్గజం
విప్రో
విడుదల
చేసిన
ఫలితాలపై
సంస్థ
చీఫ్
ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్
థియరీ
డెలాపోర్టే
స్పందించారు.
YoYలో
కంపెనీ
వార్షిక
రాబడి
11.5
శాతం
వృద్ధి
చెందగా..
FY24
మొదటి
త్రైమాసికంలో
దీనివల్ల
ఇబ్బందులు
తలెత్తే
అవకాశం
ఉన్నట్లు
చెప్పారు.
ఆదాయ
వృద్ధిని
-3
నుంచి
-1
శాతానికి
తీసుకురావాలని
సంస్థ
మార్గనిర్దేశం
చేసినా,
స్థూల
ఆర్థిక
పరిస్థితి
సవాలుగా
ఉండనున్నట్లు
తెలిపారు.
గత
త్రైమాసికాల్లో
మార్జిన్లు
16
శాతంగా
ఉండవచ్చని
అంచనా
వేసినట్లు
వెల్లడించారు.

స్థిర
కరెన్సీ
వద్ద
0.6
శాతం
ఆదాయ
వృద్ధి
క్షీణతకు
మార్కెట్‌లోని
అనిశ్చితి,
వ్యయంలో
మందగమనం
కారణమని
డెలాపోర్టే
తెలిపారు.
దీర్ఘకాలిక
అనిశ్చితి
వల్ల
తమ
క్లయింట్లు,
IT
పరిశ్రమ
సహా
అనేక
రంగాలు
ప్రభావితమైనట్లు
వెల్లడించారు.

పరిణామాలు
తమ
బిజినెస్,
అంచనాలను
సైతం
కుదుపునకు
గురిచేసినట్లు
చెప్పారు.
అమెరికా
మరియు
యూరప్
మార్కెట్లు
రెండింటిలోనూ
QoQ
ప్రాతిపదికన
Q4లో
వృద్ధి
క్షీణత
నెలకొన్నట్లు
గుర్తుచేశారు.
ఇదే
సమయంలో
ఆసియా
పసిఫిక్/మిడిల్
ఈస్ట్/ఆఫ్రికా
(APMEA)
మార్కెట్
మాత్రం
0.7
శాతం
వృద్ధి
చెందినట్లు
పేర్కొన్నారు.

IT news: విప్రో Q4 వృద్ధిలో క్షీణతకు కారణాలివీ.. FY24 Q1 అంచ

కంపెనీ
BFSI
(బ్యాంకింగ్,
ఫైనాన్షియల్
సర్వీసెస్
మరియు
ఇన్సూరెన్స్)
వర్టికల్స్
లో
2.4
శాతం
QoQ
క్షీణతను
చూసింది.
వినియోగదారుల్లో
-0.9
శాతం,
టెక్నాలజీలో
-2.7
శాతం,
తయారీలో
-0.3
శాతం,
కమ్యూనికేషన్స్‌
లో
-0.4
శాతం
దెబ్బతిన్నాయి.
అయితే
ప్రధానంగా
ఎనర్జీ,
సహజ
వనరులు
మరియు
యుటిలిటీల
నుంచి
5.9
శాతం,
ఆరోగ్య
విభాగం
ద్వారా
2
శాతం
వృద్ధి
నమోదైంది.

BFSI,
రిటైల్,
ప్యాకేజ్డ్
ఉత్పత్తులు
మరియు
సాంకేతికతలో
చెప్పుకోదగ్గ
స్థాయిలో
వృద్ధి
సాధించలేదని
CEO
వెల్లడించారు.
కన్సల్టింగ్
రంగంలో
క్యాప్కో,
రైజింగ్
వంటి
కొనుగోళ్లను
విప్రో
జరిపినా
అక్కడా
పరిస్థితి
స్తబ్ధుగానే
ఉన్నట్లు
తెలిపారు.
మందగమనం
వేళ
మొదటగా
ప్రభావితమయ్యేది
కన్సల్టింగ్
కాగా..
తిరిగి
వెంటనే
పుంజుకునేది
కూడా
అదేనన్నారు.

విభాగానికి
సాంకేతిక
నైపుణ్యం
జోడిస్తూ
క్లయింట్ల
వద్ద
నుంచి
మరిన్ని
డీల్స్
రాబడుతున్నట్లు
చెప్పారు.

బ్యాంకింగ్
సంక్షోభం
IT
కంపెనీల
ఫలితాలపై
ప్రభావం
చూపుతుందని
అంచనా.
యునైటెడ్
స్టేట్స్
‌లోని
సిలికాన్
వ్యాలీ
బ్యాంక్
(SVB),
సిగ్నేచర్
బ్యాంక్
మరియు
క్రెడిట్
సూయిస్
వంటి
వివిధ
ప్రాంతీయ
బ్యాంకుల
పతనం
కారణంగా..

ఏడాది
మొదటి
3
నెలలు
పరిస్థితి
దారుణంగా
ఉంది.
ప్రపంచ
బ్యాంకింగ్
రంగం
ఒక్కసారిగా
పెద్ద
కుదుపునకు
లోనైంది.
ఇప్పటికే
స్థూల
ఆర్థిక
సవాళ్లతో
సతమతమవుతున్న
IT
పరిశ్రమకు
ఇది
మరింత
ఇబ్బందిగా
తయారైంది.

English summary

Wipro expects weeker Q1 results FY24 amid macro environment remains challenging

Wipro expects weeker Q1 results FY24 amid macro environment remains challenging

Story first published: Friday, April 28, 2023, 7:20 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *