[ad_1]
News
oi-Chekkilla Srinivas
ITC లిమిటెడ్ శుక్రవారం డిసెంబర్ 2022 త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కంపెనీ నికర లాభం 21 శాతం పెరిగి రూ.5,031.01 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.15862 కోట్ల నుంచి 2.3 శాతం పెరిగి రూ.16225.1 కోట్లకు చేరుకుంది. ITC రూ.6 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి 15 ఫిబ్రవరి, 2023 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.
మధ్యంతర డివిడెండ్ చెల్లింపు 3 మార్చి 2023, 5 మార్చి, 2023 మధ్య చెల్లించనున్నారు. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు (EBITDA) సంవత్సరానికి 22% పెరిగి రూ.5,102.1 కోట్ల నుంచి రూ.6223.2 కోట్లకు చేరుకుంది. సెగ్మెంట్ల వారీగా, FMCG-సిగరెట్‌ల ఆదాయం 16.72 శాతం పెరిగి రూ.7288 కోట్లకు చేరుకుంది. FMCG-ఇతర ఆదాయం రూ.4841 కోట్లుగా ఉంది.
హోటళ్ల ద్వారా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన ఆదాయం రూ.473.39 కోట్లు రాగా ఇప్పుడు 50.48 శాతం పెరిగి రూ.712.39 కోట్లకు చేరుకుంది. వ్యవసాయ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం మాత్రం తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ.3,123.77 కోట్లుగా ఉండగా.. ఇది గత సంవత్సరం రూ.4,962.37 కోట్లుగా ఉంది. అంటే 37 శాతం తగ్గింది.
English summary
ITC declared dividend along with December quarter results
ITC Limited released its December 2022 quarterly results on Friday. The company’s net profit increased by 21 percent to Rs 5,031.01 crore.
Story first published: Saturday, February 4, 2023, 9:53 [IST]
[ad_2]
Source link