News
lekhaka-Bhusarapu Pavani
ITR
Filing:
ఆదాయపు
పన్ను
రిటర్నులు
ఫైల్
చేయడం
కొత్త
వారికి
కొంత
క్లిష్టంగా
అనిపించవచ్చు.
అయితే
ఇటీవల
ప్రారంభించిన
ఆన్‌లైన్
ఫారమ్‌ల
ద్వారా
ఈ
విధానం
సరళీకృతం
చేయబడింది.
FY23కి
గాను
పన్ను
చెల్లింపుదారులకు
30
రోజులలోపు
80
శాతం
రీఫండ్‌లు
అందించబడినట్లు
సంబంధిత
శాఖ
వెల్లడించింది.
తద్వారా
ఈ
ఫారమ్‌లు
మరింత
సౌకర్యవంతంగా
మారినట్లు
తెలుస్తోంది.
FY23లో
ఆదాయపు
పన్ను
రీఫండ్
కోసం
తీసుకున్న
సగటు
సమయాన్ని
16
రోజులకు
తగ్గించినట్లు
సెంట్రల్
బోర్డ్
ఆఫ్
డైరెక్ట్
టాక్సెస్
ప్రకటించింది.
FY22లో
26
రోజులతో
పోలిస్తే
గణనీయంగా
మెరుగుపడినట్లు
పేర్కొంది.
రిటర్నుల
ఫైలింగ్
మొదలైన
మరుసటి
రోజే
దాఖలు
చేసిన
రిటర్నుల
శాతం
కూడా
21
నుంచి
42
శాతానికి
పెరిగినట్లు
తెలిపింది.

టెక్నాలజీ
మరియు
డిజిటల్
ప్లాట్‌ఫారమ్‌ల
ఏకీకరణతో
ఇది
సాధ్యమైనట్లు
తెలుస్తోంది.
జూలై
28
2022న
ఒకే
రోజులో
22.94
లక్షల
రిటర్న్‌లను
ఆదాయపు
పన్ను
శాఖ
ప్రాసెస్
చేసింది.
ఇదే
గరిష్ఠ
స్థాయి
కావడం
విశేషం.
సరిదిద్దాల్సిన
అభ్యర్థనలు
సైతం
కేవలం
0.1
శాతానికి
తగ్గాయి.
అవి
కూడా
కేవలం
తొమ్మిది
రోజుల్లోనే
ప్రాసెస్
చేయబడుతున్నాయి.
FY23
చివరి
నాటికి
4
లక్షల
మందికి
ఫేస్
లెస్
అసెస్మెంట్
ను
కూడా
ప్రత్యక్ష
పన్నుల
శాఖ
పూర్తి
చేసింది.
FY22
మరియు
FY23
మధ్య
ఈ
ప్రక్రియకు
సంబంధించిన
ఫిర్యాదులు
60
శాతం
తగ్గాయి.
పెరుగుతున్న
సాంకేతికతను
ఎప్పటికప్పుడు
చొప్పిస్తూ,
పన్ను
చెల్లింపుదారులకు
సరళమైన
రీతిలో
సేవలు
అందించడానికి
ఆదాయపు
పన్ను
శాఖ
చేసిన
ప్రయత్నాల
ఫలితమే
ఇది
అని
ఒప్పుకోక
తప్పదు.
English summary
Income tax refund issue span reduced to 16
Income tax refund issue span reduced to 16..
Story first published: Friday, June 2, 2023, 22:49 [IST]