​Jasmine tea: వేసవి అంటే సూర్యుడి భగభగలే కాదు.. మల్లెల పరిమళాలు కూడా. ఈ సీజన్‌లో మల్లెలు విరగబూస్తాయి. మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. మల్లె పూవు పరిమళాన్ని ఇష్టపడని వారుండారు. మల్లెపువ్వులు అంటే దైవార్చనకు, మహిళలు తలలో పెట్టుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడవనే ఆలోచనలో చాలా మంది ఉంటారు, అయితే దీన్నిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మల్లెపూవ్వు టీని రోజూ తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో డీహైడ్రేట్‌ చేసి ఈ టీని తయారు చేస్తారు. మల్లెపువ్వు టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

యాంటీఆక్సిడెంట్‌ రిచ్‌..

మల్లె టీలో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఫ్రీ రాడికల్స్‌ కారణంగా కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ కారణంగా.. అనేక రకాల క్యాన్సర్‌లు, గుండె సమస్యలు వచ్చే ముప్పు ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్‌ టీ తో తయారు చేసిన జాస్మిన్‌ టీలో ఫాలీఫెనాల్స్‌ మెండుగా ఉంటాయి. ఈ టీలో ప్రత్యేకించి శక్తివంతమైన కాటెచిన్ ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంచడానికి, గుండె, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. EGCGలో బ్లడ్-లిపిడ్-తగ్గించే ప్రభావాలు ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

(image source – pixabay)

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

మల్లోపువ్వు టీ తాగితే.. జీవక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఇది మీ జీవక్రియను 4-5% వేగవంతం చేస్తుంది, 10-16% వేగంగా కొవ్వును కరిగిస్తుంది. ఈ టీ రోజుకు 70–100 కేలరీలు అదనంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. జాస్మిన్‌ టీలో EGCG లక్షణాలు కొవ్వును వేగవంతంగా కరిగిస్తాయి.

(image source – pixabay)

గుండెను రక్షిస్తుంది..

గుండెను రక్షిస్తుంది..

జాస్మిన్ టీలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. మల్లె పువ్వు టీలోని పాలీఫెనాల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి గుండె సమస్యల ముప్పును పెంచుతుంది. జాస్మిన్‌ టీ చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను తగ్గించినట్లు ఎలుకలపై చేసిన అధ్యయనంలో గుర్తించారు. తరచుగా జాస్మిన్‌ టీ తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

jungle jalebi: సీమ చింత.. కొలెస్ట్రాల్‌ కరిగించడమే కాదు, క్యాన్సర్‌కు చెక్‌ పెడుతుంది..!

మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది..

మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది..

జాస్మిన్‌ టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలోని కెఫిన్ మీ మెదడు, శరీరానికి మధ్య సంకేతాలను అందించే రసాయనం. నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ అడెనోసిన్‌ను నిరోధించి మీ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. సాధారణంగా, అడెనోసిన్ మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. కెఫీన్ మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. డోపమైన్, సెరోటోనిన్ వంటి ఇతర మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరోట్రాన్స్‌మిటర్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. జాస్మిన్ టీలో అమైనో యాసిడ్ ఎల్-థియానైన్ కూడా ఉంది, ఇది గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్ (GABA) విడుదలను ప్రేరేపిస్తుంది – ఇది మిమ్మల్ని రిలాక్స్‌డ్‌గా ఉంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

(image source – pixabay)

Health Tips:ఈ అలవాట్లు మీ ఆరోగ్యానికి హానికరం..!

జర్వం తగ్గుతుంది..

జర్వం తగ్గుతుంది..

యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇది జ్వరాన్ని తగ్గించి వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది.

(image source – pixabay)

నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

జాస్మిన్‌ టీలో కాటెచిన్‌‌లు మెండుగా ఉంటాయి. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ (4 ట్రస్టెడ్ సోర్స్, 13 ట్రస్టెడ్ సోర్స్) వంటి ప్లేక్-ఫార్మింగ్ బ్యాక్టీరియాను నాశనం చేసి.. దంత క్షయం నుంచి రక్షిస్తాయి. మల్లె టీ నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

(image source – pixabay)

టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు తగ్గిస్తుంది..

-2-

టైప్‌ 2 డయాబెటిస్‌ మప్పు తగ్గించడానికి, ఇప్పటికే డయాబెటిస్‌ ముప్పు తగ్గించడానికి జాస్మిన్‌ టీ సహాయపడుతుందని అని నిపుణులు చెబుతున్నారు. ఈ టీలో ప్రత్యేకించి శక్తివంతమైన కాటెచిన్ ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) ఉంటుంది. ఇది శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. (image source – pixabay)

Health Tips:ఈ అలవాట్లు మీ ఆరోగ్యానికి హానికరం..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *