[ad_1]
క్షీణించిన స్టాక్ ధర..
Kfin Technologies షేర్లు ప్రస్తుతం BSEలో 3% పైగా క్షీణించి రూ.356.85 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 2.16 శాతం క్షీణించి రూ.358.10 వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం మార్కెట్ల ప్రారంభానికి ముందుగానే కంపెనీ షేర్లు ఫ్లాట్ గా లిస్ట్ అవుతాయని మార్కెట్ వర్గాలు భావించాయి.
ప్రమోటర్ల వాటా..
కెఫిన్ టెక్ షేర్లు మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ప్రమోటర్ల వాటా గతంలో కంటే తగ్గింది. ఈ ఐపీవో 19 డిసెంబర్ 2022న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడింది. ఆ సమయంలో కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ను రూ.347-366గా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.1500 కోట్లను సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 13 లాట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు కంపెనీ అనుమతించగా.. లాట్‌లో 40 షేర్లు ఉన్నాయి. గతంలో ప్రమోటర్లకు కంపెనీలో మెుత్తం 74.37% వాటా ఉండగా.. ఐపీవో తర్వాత అది 49.91%నికి తగ్గింది.
పెట్టుబడుల వివరాలు..
ఐపీవో మొత్తం 2.59 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. పబ్లిక్ ఇష్యూ రిటైల్ కోటా 1.36 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అయితే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 4.17 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.6,133 కోట్లుగా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 675 కోట్లను సేకరించింది. ఒక్కో షేర్ ధర రూ.366 చొప్పున 44 ఫండ్‌లకు కంపెనీ 1.84 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశాయి.
[ad_2]
Source link
Leave a Reply