Tuesday, April 13, 2021

lady: స్కెచ్ వేసి కారులో మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్, పోలీసుల కాల్పుల్లో రౌడీషీటర్ గ్యాంగ్, ఖర్మ !

బెంగళూరు రౌడీషీటర్

బెంగళూరులో శబరీష్ అనే రౌడీషీటర్ కొంతకాలంగా రెచ్చిపోతున్నాడు. శబరీష్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని కోసం చాలా రోజులుగా బెంగళూరులోని యలహంక ఉపనగర పోలీసులు గాలించారు. ఇటీవల రౌడీషీటర్ శబరీష్ పోలీసులకు చిక్కినట్లేచిక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

 మనోడికి బుల్లెట్ రుచి

మనోడికి బుల్లెట్ రుచి

తప్పించుకోవడానికి ప్రయత్నించి పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించిన శబరీష్ అంతు చూడాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పారిపోతున్న శబరీష్ మీద యలహంక ఉపనగర పోలీసులు కాల్పులు జరిపారు. కాలిలో తూటా దూసుకోవడంతో కుప్పకూలిన శబరీష్ పోలీసులకు చిక్కిపోయాడు.

 చేసినోడికి చేసుకున్నంత

చేసినోడికి చేసుకున్నంత

రౌడీషీటర్ శబరీష్ చిక్కిన తరువాత అతని ప్రధాన అనుచరులు ఇమ్రాన్, మురళి కోసం పోలీసులు గాలించారు. సేమ్ టూ సేమ్ సీన్ లాగా ఇమ్రాన్, మురళి కూడా పోలీసుల మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో యలహంక ఉపనగర పోలీసులు కాల్పులు జరపడంతో ఇమ్రాన్, మురళి కాళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఇద్దరూ పోలీసులకు చిక్కిపోయారు.

 మహిళ కిడ్నాప్.... కారులో గ్యాంగ్ రేప్

మహిళ కిడ్నాప్…. కారులో గ్యాంగ్ రేప్

పోలీసుల విచారణలో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తుపాకి తూటల దెబ్బతో పోలీసులకు చిక్కిన రెండు రోజుల ముందు రౌడీషీటర్ శబరీష్ గ్యాంగ్ చేతిలో ఓ అమాయకురాలు బలి అయ్యిందని వెలుగు చూసింది. ఎర్రగా, బుర్రగా, బలంగా ఉన్న వివాహిత మహిళను నిందితులు కారులో కిడ్నాప్ చేశారని, తరువాత కొన్ని గంటల పాటు కారులోనే ఆమె మీద శబరీష్ గ్యాంగ్ గ్యాంగ్ రేప్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 బెండ్ తీస్తే బయటకు వచ్చింది

బెండ్ తీస్తే బయటకు వచ్చింది

ఇంటి పని చేసే వివాహిత మహిళ గ్యాంగ్ రేప్ కు గురైయ్యిందని, అయితే ఆ మహిళ రౌడీ శబరీష్ గ్యాంగ్ కు బయపడి ఇంత వరకు ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అన్నారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యకపోయినా పోలీసులు ఇచ్చిన స్పెషల్ ట్రీట్ మెంట్ తో విషయం బయటకు వచ్చింది. మహిళ మీద గ్యాంగ్ రేప్ చేశామని రౌడీషీటర్ శబరీష్, అతని అనుచరులు ఇమ్రాన్, మురళి, బీబీఎంపీ ఉద్యోగి రంజిత్ అంగీకరించారని యలహంక ఉపనగర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రామక్రిష్ణారెడ్డి అన్నారు.

 పగలు ఉద్యోగం... రాత్రి లూటీలు.... నేరాలు

పగలు ఉద్యోగం… రాత్రి లూటీలు…. నేరాలు

రౌడీషీటర్ శబరీష్ గ్యాంగ్ లో అరెస్టు అయిన రంజిత్ కు ఓ స్పెషల్ స్టోరీ ఉంది. బెంగళూరులో ( బీబీఎంపీ) చెత్త సేకరించే వాహనం డ్రైవర్ గా కొన్ని సంవత్సరాల నుంచి రంజిత్ పని చేస్తున్నాడు. పగలు పూట బుద్దిగా ఉద్యోగం చేస్తున్న రంజిత్ రాత్రి పూట నిందితులతో సంచరిస్తూ లూటీలు, నేరాలు చేస్తున్నాడని యలహంక ఉపనగర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రామక్రిష్ణారెడ్డి చెప్పారు.

 డబ్బు ఆశతో స్కెచ్ లు

డబ్బు ఆశతో స్కెచ్ లు

నిందితులు వివాహిత మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసే రెండు రోజుల ముందు నాగరాజ్ అనే వ్యక్తిపై దాడి చేసి నిలువు దోపిడీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. త్వరగా డబ్బులు సంపాధించాలనే ఆశతో బీబీఎంపీ చెత్త వాహనం డ్రైవర్ రంజిత్ రౌడీషీటర్ శబరీష్ గ్యాంగ్ లో చేరాడని పోలీసులు అంటున్నారు. రౌడీషీటర్ శబరీష్ గ్యాంగ్ ఇంకా ఎన్ని అరాచకాలు చేశారు ? అంటూ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని యలహంక ఉపనగర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రామక్రిష్ణారెడ్డి తెలిపారు.


Source link

MORE Articles

Roof Of The World: तिब्बत के पठार पर Global Warming का खतरा, तापमान बढ़ने पर तेजी से पिघल रहे ग्लेशियर

बीजिंग: हाल ही में उत्तराखंड (Uttarakhand) में ग्लेशियर (Glacier) फटने से लगभग 80 लोगों की जान चली गई थी. हिमालय (Himalaya) पर मंडराते...

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా మొబిలిటీ కొత్తగా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి అని, లాస్ట్ మైల్ డెలివరీ కోసం పర్యావరణ సాన్నిహిత్యమైన...

పెళ్లి ఆపిన ‘బుల్లెట్’.. బైక్ కోసం వరుడి నానా యాగీ, గుర్రం దిగీ మరీ హంగామా..

డ్రెస్ విప్పేసి నానా హంగామా.. పెళ్లిలో వరుడికి బైక్ ఇస్తుంటారు. కారు ఇస్తుంటారు. బంగారు గొలుసు పెడతాం అని చెబుతారు. వధువు తరపువారు మాట ఇస్తుంటారు....

पानी में भिगाकर ऐसे करें दालचीनी का इस्तेमाल, होंगे ये 6 फायदे

अगर दालचीनी के पानी का सही मात्रा सेवन किया जाए, तो महिलाओं खुद को कई गंभीर बीमारियों से बचा सकती हैं.  Source link

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe